Samantha: పలని స్వామి దీవెనల కోసం తమిళనాడు వెళ్ళిన సమంత

Samantha: తమిళనాడు గుడిలో ప్రత్యక్షమైన సమంత

Dhatripriya
Published on: 15 Feb 2023 10:46 AM IST
Samantha Went To Tamil Nadu Palani Swami Temple
X

Samantha: పలని స్వామి దీవెనల కోసం తమిళనాడు వెళ్ళిన సమంత

Samantha: స్టార్ బ్యూటీ సమంత గత కొంతకాలంగా మయూసైటిస్ అనే ఒక అరుదైన ఇమ్యూనిటీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమంత డాక్టర్ల ఆధ్వర్యంలో గత కొంతకాలంగా చికిత్స పొందుతోంది. తాజాగా ఇప్పుడు సమంత తమిళనాడులోని పలని టెంపుల్ లో కనిపించింది. మాస్క్ పెట్టుకుని సమంత గుడిలోని ప్రతి మెట్టుకి దీపం పెట్టుకుంటూ పైకి ఎక్కింది. గుడి లోపలికి చేరుకున్నాక సమంత పలని స్వామికి కొన్ని ప్రత్యేకమైన పూజలు కూడా జరిపించి స్వామి దీవెనలను అందుకున్నారు.

సమంత వస్తున్న సంగతి గుడి నిర్వహణకు ముందుగానే తెలియడంతో వారు కావాల్సిన ఏర్పాట్లు అన్ని చూసుకున్నారు. కానీ సమంతా రాక గురించి మీడియా వారికి మాత్రం ఇన్ఫర్మేషన్ లేదు. సడన్గా సమంత పలని స్వామి గుడిలో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన ఆరోగ్య పరిస్థితి రీత్యా సమంత పలని స్వామి దీవెనల కోసం వెళ్లిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు సమంత ఆరోగ్యం త్వరలోనే కుదుటపడాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

ఇక సినిమాలపరంగా చూస్తే సమంత చేతిలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న "ఖుషీ" సినిమా లో కనిపించనున్న సమంత బాలీవుడ్ లో వరుణ్ ధావన్ సరసన "సిటాడెల్" అనే వెబ్ సిరీస్లో కనిపించనుంది. మరోవైపు సమంత నటిసించిన "శాకుంతలం" ఈ ఏడాది ఏప్రిల్ 14 న విడుదల కాబోతోంది.

Dhatripriya

Dhatripriya

Next Story