Samantha: మనసులో బాధ పడుతూ పైకి నవ్వుతున్న సమంత

Samantha: తాను సంతోషంగానే ఉన్నాను అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్న సమంత

admin1
Updated on: 2 Nov 2021 5:24 PM IST
Samantha was Suffering Due to Divorce with Naga Chaitanya
X

మనసులో బాధ పడుతూ పైకి నవ్వుతున్న సమంత (ఫైల్ ఇమేజ్)

Samantha: విడాకులు తీసుకోవడం, ప్రేమించిన వారికి దూరం అవడం ఎవరి జీవితంలోనైనా చాలా బాధాకరమైన దశ. కానీ అలాంటి కష్ట పరిస్థితుల నుండి మనల్ని మనం ఎలా బయటకు తెచ్చుకో గలం అనే దానిమీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది.

ఈ మధ్యనే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత కూడా ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉంది. కానీ బయటకు మాత్రం నవ్వుతూ చాలా సంతోషంగా ఉన్నాను అని అందరికీ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. అయితే దానికి కారణాలు లేకపోలేదు. ఎంత కష్టం వచ్చినప్పటికీ సెలబ్రిటీలు తన బాధని కెమెరా ముందు చూపించలేరు.

సెలబ్రిటీలు ఇలాంటి సమయాల్లో స్ట్రాంగ్ గా లేకపోతే తమకు వచ్చే సినిమా ఆఫర్లు, బ్రాండ్ ఎండార్స్ మెంట్ లు అన్ని వచ్చినట్టే వెనక్కి వెళ్లి పోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే తన కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది సమంత. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన వర్కౌట్ మరియు వెకేషన్ ఫోటోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాను ఇప్పుడు సంతోషంగానే ఉన్నట్లు అందరికీ చూపించాలని ప్రయత్నిస్తున్నట్లు ఉంది సామ్.

నిజానికి విడాకుల వల్ల డిప్రెషన్ లో ఉన్నప్పటికీ సమంత మాత్రం బయటకి చాలా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ నిజంగా తన మనసులో ఏముంది అనేది మాత్రం కేవలం సమంతా కి మాత్రమే తెలుసేమో. ఏదేమైనా విడాకుల తర్వాత కరియర్ మీద దృష్టి పెట్టిన సమంత వరుస ప్రాజెక్టులు సైన్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

admin1

admin1

Next Story