Samantha: పూజా హెగ్డే స్థానంలో సమంత

Samantha: పూజ బదులు మహేష్ తో రొమాన్స్ చేయనున్న సమంత

admin1
Published on: 29 Nov 2021 6:56 PM IST
Samantha to Replace Pooja Hegde in Mahesh Babu
X

పూజ హెగ్డే స్థానములో సమంత (ఫైల్ ఇమేజ్)

Samantha: ఈ మధ్యనే "సరిలేరు నీకెవ్వరు" సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో "సర్కారు వారి పాట" అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. "అతడు", "ఖలేజా" సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది.

నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పాత్ర కోసం ముందుగా పూజా హెగ్డే అని అనుకున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే ప్రకటించింది చిత్రబృందం. కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు పూజాహెగ్డే స్థానంలో సమంత ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పూజా హెగ్డే ని తొలగించి ఆమె స్థానంలో సమంతని పెట్టడం వెనుక గల కారణం క్రియేటివ్ డిఫరెన్స్ లేక డేట్స్ అవైలబిలిటీ లేకపోవడమా అని సర్వత్రా ఆసక్తి మొదలైంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

admin1

admin1

Next Story