ఆర్ఎక్స్ 100 దర్శకుడి చిత్రంలో సమంత

Ruthvik
Published on: 19 March 2019 1:58 PM IST
ఆర్ఎక్స్ 100 దర్శకుడి చిత్రంలో సమంత
X

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న తక్కువ మంది దర్శకుల్లో అజయ్ భూపతి కూడా ఒకడు. పాయల్ రాజ్ పుత్, కార్తికేయ హీరోహీరోయిన్లుగా నటించిన 'ఆర్ఎక్స్ 100' సినిమాతో దర్శకుడిగా మారాడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ ఇతని రెండవ సినిమా మొదలవలేదు. గతేడాది కొందరు యువ హీరోలు ఇతని తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపినప్పటికీ కాల్షీట్ సమస్య వల్ల ఒక్క సినిమా కూడా సెట్స్పైకి వెళ్లలేదు. తాజా సమాచారం ప్రకారం 'మహాసముద్రం' అనే టైటిల్ తో అజయ్ వద్ద ఒక ఫుల్ స్క్రిప్ట్ రెడీ గా ఉందని తెలుస్తోంది.

ఆ స్క్రిప్ట్ విన్న సమంత అది బాగా నచ్చడంతో ఆమె వెంటనే సినిమాలో నటించేందుకు ఒప్పుకుందని టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా ఒక మల్టీస్టారర్ అని అందులో ఇద్దరు హీరో లు కావాలని తెలుస్తోంది. ఇద్దరు హీరోల డేట్లు దొరికితే షూటింగ్ వెంటనే మొదలవుతుందని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరో ఇంకా ఖరారు కాలేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రామ్, నితిన్ ఇంకా ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నారు. మరి ఈ రెండవ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో ఇంకా తెలియాల్సి ఉంది.

Ruthvik

Ruthvik

Next Story