Samantha: నాడు బిగ్ బాస్ హోస్ట్.. నేడు ఎవరు మీలో కోటీశ్వరులు గెస్ట్

* జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్ షో కి గెస్ట్ గా సమంత

Sandeep Reddy
Updated on: 11 Oct 2021 5:53 PM IST
Samantha to Make her First Participation as a Guest After Confirming Divorce in Jr NTR Evaru Meelo Koteeswarulu
X

Samantha: నాడు బిగ్ బాస్ హోస్ట్ .. నేడు ఎవరు మీలో కోటీశ్వరులు గెస్ట్

Samantha - Evaru Meelo Koteeswarulu: నాగచైతన్యతో విడాకుల తరువాత అక్కినేని కుటుంబంతో సంబంధాలను తెంచుకొని సోలో లైఫే సో బెటర్ అనుకొని ప్రస్తుతం సింగిల్ గా గడుపుతున్న సమంత త్వరలో ఒక ప్రముఖ టెలివిజన్ ఛానెల్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న గేమ్ షోలో అతిధిగా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుందని తాజాగా విడుదలైన ఒక ప్రోమోతో తెలుస్తుంది. గత ఏడాది ఇదే సమయానికి మాజీ మామ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ షోకి దసరా సందర్భంగా స్పెషల్ హోస్ట్ గా వ్యవహరించిన సమంత.. తాజాగా ఈ ఏడాది దసరాకి బుల్లితెరపై మరో గేమ్ షోలో అతిధిగా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

ఎవరు మీలో కోటీశ్వరులు షోకి గెస్ట్ గా హాజరైన సమంతని ఎన్టీఆర్ తనదైన శైలిలో ప్రశ్నలతో ఒకవైపు టెన్షన్ పెడుతూనే నవ్వించాడు. ఈ గేమ్ షోలో అందరూ వెయ్యి నుండి కోటి రూపాయలకు వెళితే.. నువ్వు మాత్రం కోటిరూపాయల నుండి వెయ్యి రూపాయలకి వస్తావంటూ సమంతతో ఎన్టీఆర్ సరదాగా మాట్లాడటంతో పాటు డబ్బులు వద్దా అంటూ అడిగిన ప్రశ్నకి మొదట వద్దు అంటూనే కావాలి అని సమంత నవ్వుతూ అనడం తాజాగా విడుదలైన ప్రోమోలో చూడవచ్చు.

విడాకుల తరువాత సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్యపు వార్తలను పట్టించుకోకుండా తన మనోధైర్యంతో మొదటిసారిగా ఈ గేమ్ షోతో అతిధిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తాను స్ట్రాంగ్ అని సమంత నిరూపించుకుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story