ఎం ఎం ఏ ట్రైనింగ్ తీసుకోబోతున్న సమంత

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఈ మధ్యనే ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ టాక్ షో "కాఫీ విత్ కరణ్" లో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి గెస్ట్ గా విచ్చేసింది.

Arun Chilukuri
Published on: 22 July 2022 2:28 PM IST
Samantha To Get MMA Training at Bangkok
X

ఎం ఎం ఏ ట్రైనింగ్ తీసుకోబోతున్న సమంత

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఈ మధ్యనే ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ టాక్ షో "కాఫీ విత్ కరణ్" లో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి గెస్ట్ గా విచ్చేసింది. హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ ఎపిసోడ్ ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తుంది. ఇప్పటికే "ది ఫ్యామిలీ మ్యాన్" సీజన్ 2 వెబ్ సిరీస్ లో కనిపించిన సమంత హిందీ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.

అయితే తాజా సమాచారం ప్రకారం సమంత ఇప్పుడు మరొక హిందీ వెబ్ సిరీస్ లో కనిపించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. "ది ఫ్యామిలీ మ్యాన్" సిరీస్ కి దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కి కూడా దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. అయితే ఈసారి సమంత ఒక పూర్తి యాక్షన్ రోల్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

దీనికోసం ఈ వెబ్ సిరీస్ లోని తన పాత్ర కోసం సమంత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోబోతోందట. ఈ నేపథ్యంలో ఆమె వరుణ్ ధావన్ తో కలిసి బ్యాంకాక్ వెళ్లి ఎంఎంఏ ట్రైనింగ్ తీసుకోబోతోందట. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ యానిక్ బెన్ సామ్ కి మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story