Samantha: డూపులు వద్దంటున్న సమంత

Samantha: యశోద సినిమాలో సమంత అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు

Jyothi
Published on: 13 July 2022 12:50 PM IST
Samantha Thrilling Action Scenes in Yashoda Movie
X

Samantha: డూపులు వద్దంటున్న సమంత 

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత త్వరలోనే "యశోద" అనే ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శక ద్యయం హరి మరియు హరీష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది. కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. షూటింగ్ పూర్తయిపోయినప్పటికీ ఇంకా ఒక పాట మాత్రం పెండింగ్ లోనే ఉంది అని యూనిట్ సభ్యులు ప్రకటించారు. అంతేకాకుండా దర్శకులు కూడా సినిమా అవుట్ పుట్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

"ఇప్పటివరకు పలు అవార్డు విన్నింగ్ సినిమాలు చేశాము కానీ కమర్షియల్ జనాలకు దగ్గర చేసే సినిమాలు చేసే ఉద్దేశంతోనే యశోద స్క్రిప్ట్ ని రాసుకున్నాము. స్క్రిప్ట్ రాస్తున్న సమయంలోనే సమంత అయితే బాగుంటుందని అనుకున్నాము. ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ కి ముందుగానే ఈ సినిమా గురించి సామ్ తో చర్చించాము. కథ చెప్పటం మొదలుపెట్టిన 25 నిమిషాలకే సమంత కూడా ఓకే చెప్పేశారు. ఆమెకు ఈ కథపై బాగా గట్టి నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం ఆమె చాలా కష్టపడి డూప్ కూడా వద్దని స్వయంగా యాక్షన్ సన్నివేశాలలో కూడా నటించారు," అని చెప్పుకొచ్చారు దర్శకులు.

Jyothi

Jyothi

Next Story