Samantha: మరోసారి వార్తల్లో నిలిచిన సమంత టాటూ..

Samantha Tattoo: స్టార్ బ్యూటీ సమంత మరియు యువ హీరో నాగచైతన్య ఇప్పటికే చాలా సినిమాల్లో కలిసి నటించారు.

Arun Chilukuri
Updated on: 10 Jun 2022 7:30 PM IST
Samantha Tattoo in the News Once Again
X

Samantha: మరోసారి వార్తల్లో నిలిచిన సమంత టాటూ

Samantha Tattoo: స్టార్ బ్యూటీ సమంత మరియు యువ హీరో నాగచైతన్య ఇప్పటికే చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఏ మాయ చేసావే సినిమా సెట్స్ పైన కలిసిన వీరిద్దరి స్నేహం ప్రేమగా మారి 2017 లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఎవరిదారిన వారు సినిమాలు చేసుకుంటూ కరియర్ లో ముందుకు వెళ్తున్నారు. అయినప్పటికీ కొన్ని విషయాలలో మాత్రం వారి వివాహ బంధాన్ని ఎప్పటికప్పుడు వారికి మరియు వారి అభిమానులకు గుర్తు చేస్తూనే వున్నాయి. విడాకుల తర్వాత సమంత తన సోషల్ మీడియా ఖాతాలను నుంచి నాగచైతన్య ఫోటోలను డిలీట్ చేసింది.

కానీ వారిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు సమంత తన ఒంటి పైన వేయించుకున్న టాటూ లు మాత్రం ఇంకా జ్ఞాపకాలు లాగా అలానే ఉండిపోయాయి. సమంత నాగచైతన్యతో కలిసి నటించిన ఏ మాయ చేసావే సినిమాకి గుర్తుగా వై ఎం సి అని టాటూ వీపు పై వేయించుకుంది. ఆ తర్వాత సమంత మరియు నాగచైతన్య ఇద్దరు తమ వేలిపై యారో టాటూలు కూడా వేయించుకున్నారు. తన భర్త పేరుని నడుము పై భాగంలో టాటూ వేయించుకుంది. కానీ విడాకుల తర్వాత కూడా ఆమె ఈ టాటూ లను తొలగించలేకపోయింది. కాగా, తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫొటోషూట్‌లో 'చై' పేరుతో ఉన్న టాటూ కనిపిస్తుండటంతో అందరి దృష్టి దానిపైనే పడింది. అలా, ఆమె టాటూ కాస్త మరోసారి వార్తల్లో నిలిచింది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story