Samantha: "ఇకనైనా జడ్జ్ చేయడం ఆపండి" అంటున్న సమంత

Samantha: సమంత ఈ మధ్యనే క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ ఫంక్షన్ లో తన డ్రెస్సు తో అందరి దృష్టిని ఆకర్షించింది...

Shireesha
Published on: 13 March 2022 9:35 AM IST
Samantha Strong Warning to Trollers for Judging Her Latest Dress | Samantha Latest News
X

Samantha: "ఇకనైనా జడ్జ్ చేయడం ఆపండి" అంటున్న సమంత

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఈ మధ్యనే క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ ఫంక్షన్ లో తన డ్రెస్సు తో అందరి దృష్టిని ఆకర్షించింది. బ్లాక్, గ్రీన్ కాంబినేషన్ లో ఉన్న ఆమె డ్రెస్ నెక్ బాగా కిందకి ఉండటంతో నెటిజన్లు ఆమెను సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విసిగిపోయిన సమంత ట్రైలర్లకు బుద్ధి చెబుతూ ఒక పెద్ద పోస్ట్ ని షేర్ చేసింది.

ఒక ఆడదానిగా ఇతరులతో జడ్జి చేయబడడం ఎలా ఉంటుందో తనకు తెలుసనీ, అందరూ ఆడ వాళ్ళని వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు, వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, ఎలా కనిపిస్తున్నారు అనే వాటి మీద రోజు జడ్జ్ చేస్తూ ఉంటారని చెప్పుకొచ్చింది."కేవలం బట్టల మీద బట్టలను ఆధారంగా ఒక మనిషి క్యారెక్టర్ని డిసైడ్ చేయడం ఈ మధ్య అందరికీ చాలా ఈజీ అయిపోయింది.

కానీ ఇప్పుడు మనం 2022 లో ఉన్నాం. కనీసం ఇప్పుడైనా ఆడవాళ్ళని జడ్జ్ చేయడం ఆపాలి. వాళ్ల నెక్ ఎంత డీప్ గా ఉంది? బట్టలు ఎలా ఉన్నాయి? అనే వాటి గురించి ఆలోచించకుండా మనల్ని మనం జడ్జ్ చేసుకుంటూ మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనల్ని మనం జడ్ చేసుకుంటూ పైకి అడిగినప్పుడే సెల్ఫీ ఎవాల్యూయేషన్ అవుతుంది. మన ఐడియాలను పక్కన వాళ్ళ మీద రుద్దటం మంచిది కాదు," అని చెప్పుకొచ్చింది సమంత.

Shireesha

Shireesha

Next Story