Samantha: సమంత సోషల్ మీడియా కి ఎందుకు దూరం అవుతోంది?

Samantha: సమంత సోషల్ మీడియా కి ఎందుకు దూరం అవుతోంది?

Rama Rao
Updated on: 26 Oct 2022 9:00 PM IST
Samantha Stays Away from Social Media | Tollywood News
X

Samantha: సమంత సోషల్ మీడియా కి ఎందుకు దూరం అవుతోంది?

Samantha: గత కొంతకాలంగా స్టార్ బ్యూటీ సమంత ఆరోగ్యం గురించి ఎన్నో పుకార్లు, వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. సమంత కి ఈమధ్య ఆరోగ్యం బాగోలేదని చికిత్స పొందడానికి అమెరికా వెళ్లిందని ఈ మధ్యనే పుకార్లు బయటకు వచ్చాయి. కానీ ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ సమంత సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. తాను హైదరాబాదులోనే ఉన్నట్లుగా రకరకాల పోస్టులతో అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే ఇదంతా మూడు రోజుల ముచ్చటగానే మిగిలింది. ఒక మూడు నాలుగు రోజుల పాటు వరుస పోస్టులు మరియు స్టోరీలతో సోషల్ మీడియాలో హంగామా చేసిన సమంత ఇప్పుడు మళ్ళీ మాయమైపోయింది. అక్టోబర్ 11న తన తదుపరి సినిమా "యశోద" ట్రైలర్ విడుదల గురించి అప్డేట్ ని పోస్ట్ చేసిన సమంత మళ్ళీ సోషల్ మీడియా జోలికి రాలేదు.

అసలు సమంతకి ఏమైంది? అంతకుముందు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఇప్పుడు ఎందుకు ఇంస్టాగ్రామ్ కి దూరంగా ఉంటుంది? పైగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సమంత అసలు పోస్టులే పెట్టకపోవడానికి కారణం ఏంటి? అని బోలెడు సందేహాలు తలెత్తుతున్నాయి. కానీ సమంత మాత్రం ఈ విషయాలపై మౌనం వహిస్తోంది. దర్శకద్వయం హరి మరియు హరీష్ దర్శకత్వంలో నటిస్తున్న "యశోద" సినిమా ట్రైలర్ అక్టోబర్ 27న విడుదల కాబోతోంది.

Rama Rao

Rama Rao

Next Story