Samantha Tattoos: చైతన్య కోసం స్పెషల్ టాటూస్ వేయించుకున్న సమంత

* నాగచైతన్య గురించి టాటూలు వేయించుకున్న సమంత

admin1
Updated on: 26 Oct 2021 2:41 PM IST
Samantha Special Tattoos Connected to Ex Husband Naga Chaitanya
X

నాగచైతన్య గురించి టాటూలు వేయించుకున్న సమంత (ట్విట్టర్ ఫోటో)

Samantha Tattoos: గత కొంతకాలంగా టాలీవుడ్ లో వినిపిస్తున్న పుకార్లని నిజం చేస్తూ టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత నాగ చైతన్య తమ విడాకులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి దాకా ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట సడన్ గా డివోర్స్ అనేసరికి అభిమానులు ఇంకా షాక్ లోనే ఉన్నారు. ఇకనుంచి చై వేరు సామ్ వేరు అనే నిజాన్ని అభిమానులు ఇంకా పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు సామ్ చెడిపోవడానికి గల కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు బయటకు వస్తుండగా మరోవైపు సామ్ టాటూస్ గురించి కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సమంత మూడు టాటూలను వేయించుకుంది. ఆ మూడు టాటూలు చై కి సంబంధించినవి అవ్వడం విశేషం.

నాగ చైతన్య ని సామ్ ఎప్పుడు చై అంటుంది. అందుకే చెయ్ అని టాటూని తన రైట్ రిబ్ పై వేయించుకుంది సామ్. ఇక నాగచైతన్య మరియు సమంత మొట్టమొదటిసారిగా కలుసుకుంది "ఏ మాయ చేశావే" సెట్స్ పైనే. అలా మొదలైన వారి స్నేహం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది ఈ నేపథ్యంలోనే సమంత తన వీపు మీద "వై ఎమ్ సీ" అనే టైటిల్ ని వేయించుకుంది. అంతేకాకుండా సామ్ కుడి చేతి మీద రెండు యారో మార్కులు ఉంటాయి. దానర్థం ఎవరి రియాలిటీ వారే సృష్టించుకోవాలి అని, తనకి చై కి ఆ టాటూ చాలా స్పెషల్ అని చాలా సందర్భాల్లో చెప్పింది సామ్. ఫెయిరీ టేల్ లాంటి వీరి ప్రేమ కథ కి సాడ్ ఎండింగ్ వచ్చినప్పటికీ వారి ఇద్దరి మధ్య బంధం ఎప్పటికీ గట్టిగానే ఉంటుందని అభిమానులు విశ్వసిస్తున్నారు.

admin1

admin1

Next Story