Samantha: ఇదంతా కర్మ ఫలితమే.. సమంత ఆసక్తికర పోస్ట్‌..

Shaakuntalam Movie: స్టార్ బ్యూటీ సమంత "శాకుంతలం" సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 18 April 2023 7:10 PM IST
Samantha Shares A Post After Shaakuntalam Box Office Failure
X

Samantha: ఇదంతా కర్మ ఫలితమే.. సమంత ఆసక్తికర పోస్ట్‌..

Shaakuntalam Movie: స్టార్ బ్యూటీ సమంత "శాకుంతలం" సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి రోజు నుంచి ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రెస్పాన్స్ వస్తోంది. సమంత స్టార్‌ ఇమేజ్‌తో బాక్సాఫీస్‌ వద్ద మంచి ఓపెనింగ్స్‌ వస్తాయనుకుంటే శాకుంతలం విషయంలో ఇది వర్కవుట్‌ కాలేదు. ఈ క్రమంలో 'శాకుంతలం' రిజల్ట్‌ చూసి సమంత డిప్రెషన్‌లోకి వెళ్లిందని బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌ ఉమైర్‌ సంధు చేసిన ట్వీట్‌ నెట్టింట దుమారం రేపుతోంది.

ఈ క్రమంలో శాకుంతలం మూవీ రిజల్ట్‌పై సమంత ఇన్‌డైరెక్ట్‌గా స్పందించింది. ''కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మాణి'' ఇది భగవద్గీత లోకి శ్లోకం. శ్రీకృష్ణుడు, అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధం జరుగుతుండగా ఉపదేశించిన గీతా సారము ఇది. దీన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టేసింది సమంత. దీంతో సమంత ముమ్మాటికీ ఈ పోస్టును శాకుంతలం మూవీ ఫలితాన్ని ఉద్దేశించే చేసిందని నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story