Samantha: ఆసక్తికరంగా మారిన సమంత ఇన్‌స్టా స్టోరీ

*ప్రపంచాన్ని మార్చాలంటే ముందు నన్ను నేను మార్చుకోవాలి- సమంత *ప్రస్తుతం చేయాల్సిన పనులపై శ్రద్ధ పెట్టాలి- సమంత

Shilpa
Published on: 4 Oct 2021 5:23 PM IST
Samantha Posted a Story in Instagram
X

సమంత(ఫోటో- ది హన్స్ ఇండియా)

Samantha: "లెట్స్ మూవ్ ఆన్" ఈ పదం ప్రస్తుత జనరేషన్‌లో కామన్ పాయింట్‌గా మారిపోయింది.! ఇద్దరు ప్రేమికులైనా భార్యాభర్తలైనా కలిసుండలేకపోతే ఇలా ఒక్క మాటతో ఎవరి దారి వారు చూసుకుంటారు. తాజాగా టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ నాగచైతన్య-సమంతలు కూడా ఇలాంటి కఠిన నిర్ణయమే తీసుకున్నారు. అయితే, విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత ఈరోజు సమంత తన ఇన్‌స్టా స్టోరీలో కీలక వ్యాఖ్యలు చేసింది.

"ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందు తనని తాను మార్చుకుంటానని శామ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. "ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే నన్ను నేను మార్చుకోవాలి. నా పడకగదిని నేను సిద్ధం చేసుకోవాలి. ఇంటిని పరిశుభ్రం చేసుకోవాలి. మధ్యాహ్నం వరకూ నిద్రపోకూడదు. ఇక, పగటి కలలు కనడం మానేసి చేయాల్సిన పనులపైనే దృష్టి పెట్టాలి'' అని సమంతా ఇన్‌స్టాగ్రం స్టోరీలో షేర్‌ చేశారు. అయితే, శామ్ ఇది ఎవరిని ఉద్దేశించి చేసిందో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.



Shilpa

Shilpa

Next Story