The Family Man 2: రాజీ పాత్రపై సమంతా ఏమన్నారంటే..!

The Family Man 2: సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ అమెజాన్‌ లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

Venkata Chari
Published on: 5 Jun 2021 3:11 PM IST
Samantha Shared her Experience As Raji Character in The Family Man 2 Web Series
X

సమంత (ఫొటో ట్విట్టర్)

The Family Man 2: అక్కినేని సమంత తొలిసారి నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ అమెజాన్‌ లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చివరి వరకు ఉత్కంఠభరితమైన సీన్స్‌తో ఆకట్టుకుంటోంది. ఇక ఇందులో రాజ్యలక్ష్మి అలియాస్ రాజీ పాత్రలో సమంత.. డీ గ్లామరస్ రోల్ ‌లో కనిపించింది. సమంత అద్భుతంగా నటించిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ప్రముఖులు కూడా సమంత నటనకు ఫిదా అవుతున్నారు.

కాగా, ఈ సిరీస్‌లో తన పాత్రకు వస్తోన్న ప్రశంసలపై ఈ బ్యూటీ స్పందించారు. ఈమేరకు మాట్లాడుతూ.. రాజీ తనకెంతో స్పెషల్‌ అని, ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 సిరీస్‌కు వస్తోన్న రివ్యూలు, కామెంట్లు చూసి ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ పాత్ర గురించి దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే నన్ను అడిగినప్పుడు.. రాజీ పాత్ర చేసేందుకు సెన్సిటివిటీ, బ్యాలెన్స్ చాలా ముఖ్యమనుకున్నాను. ఈలం పోరులో తమిళుల పోరాటాలు.. మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందులపై కొన్ని డాక్యూమెంటరీలు మేకర్స్ పంపించారు. ఈ వీడియోలు చూసి నేను చాలా భయపడ్డాను. ఆ యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, ప్రపంచం వాళ్ల వైపు కన్నెత్తి చూడలేదు. ఈ పాత్రతో వారికి నివాళులు అర్పిస్తున్నాను. ఈ పాత్ర కేవలం కల్పితమైనప్పటికీ.. నాకు మాత్రం చాలా చాలా స్పెషల్. రాజీ కథ మనకు ఎంతో అవసరం. ద్వేషం, అణచివేత, దురాశపై పోరాడేందుకు మనమంతా కలిసి ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను' అని సమంత వెల్లడించింది.


అలాగే కొన్ని బోల్డ్‌ సీన్స్‌లో కనిపించడంతో... ఫ్యాన్స్ షాకయ్యారు. ఈ మేరకు సమంత పై ప్రశంసలు కురిపిస్తూ... ట్విట్టర్లో కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సీన్స్‌లో నటించాలంటే చాలా గట్స్ కావాలి. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉండి, ఇలాంటి బోల్స్‌ సీన్స్ చేయడమంటే... మాములు విషయం కాదంటూ మెచ్చుకుంటున్నారు. బోల్డ్ సీన్స్‌తో పాటు యాక్షన్‌ సీన్స్‌లోనూ తనదైన శైలిలో నటించి మెప్పించింది సమంత.


తెలుగులో ఎప్పుడంటే..

అయితే, ప్రస్తుతం అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 సిరీస్‌పై తెలుగు అభిమానులు నిరాశగా ఉన్నారు. కేవలం హిందీలో మాత్రమే విడుదల చేయడంపై నిరాశ చెందుతున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ సిరీస్ వచ్చే వారంలో అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అంటే మరో వారందాకా తెలుగు వీక్షకులు వెయిట్ చేయాల్సిందే మరి.



Venkata Chari

Venkata Chari

Next Story