Samantha: టాటూలపై సమంత షాకింగ్ కామెంట్స్

Samantha: స్టార్ బ్యూటీ సమంత ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 18 April 2022 4:46 PM IST
Samantha Says Never Ever Get a Tattoo
X

Samantha: టాటూలపై సమంత షాకింగ్ కామెంట్స్

Samantha: స్టార్ బ్యూటీ సమంత ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. తన మకాంను ముంబైకి మార్చే పనిలో సమంత ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో సమంత ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఇక విడాకుల ప్రకటన అనంతరం సామ్ షేర్ చేసే ప్రతి పోస్ట్ పై నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా తన ఇన్ స్టా ఫాలోవర్లతో కాసేపు ముచ్చటించింది సామ్. ఈ క్రమంలో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చింది. అయితే ఇందులో ఓ నెటిజన్ సమంతను టాటూ గురించి ప్రశ్నించాడు.. దీంతో అతనికి ఊహించని ఆన్సర్ ఇచ్చింది సామ్.

కొన్ని టాటూల్ని మీరు ఏదో ఒకరోజు ప్రేమిస్తారు కదూ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత నవ్వుతూనే స్పష్టంగా సమాధానమిచ్చింది. ఎప్పుడూ, ఎన్నడూ టాటూ వేసుకోవద్దని, ఎప్పటికీ వేసుకోద్దని స్పష్టం చేసింది. సమంత నడుము పైభాగంలో తన మాజీ భర్త నాగచైతన్య పేరు 'చై' అనే టాటూ ఉన్న సంగతి తెలిసిందే. వీపుపై, కుడి చేతిపై మరో రెండు టాటూలు ఉన్నాయి. అందరూ స్వశక్తిపై నమ్మకం పెట్టుకోవాలని, కలలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story