100 సార్లు పడినా మళ్లీ లేస్తాను అంటున్న సమంత...

Samantha: ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ఈ మధ్యనే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

admin1
Published on: 28 Jan 2022 9:37 AM IST
Samantha says I will get it again even if it falls 100 times
X

100 సార్లు పడినా మళ్లీ లేస్తాను అంటున్న సమంత...

Samantha: ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ఈ మధ్యనే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత కేవలం కెరీర్ పైన దృష్టి పెట్టిన సమంత వరుస సినిమాలను సైన్ చేసుకుంటూ ముందుకు దూసుకు వెళుతోంది. తాజాగా "పుష్ప" సినిమాలో ఐటమ్ సాంగ్ లో కూడా కనిపించిన సమంత ఇప్పుడు స్విజర్లాండ్ లో ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. తాజాగా ఆమె స్కీయింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు నెట్ లో ఈ వీడియో వైరల్ గా మారింది.

"వంద సార్లు పడిపోవడం లో ఇది కూడా. కేట్ నన్ను కాపాడు" అని రాసిన సమంత స్కీయింగ్ వీడియోని కూడా పోస్ట్ చేసింది. "చిన్న చిన్న పిల్లలతో నేను నా స్కీయింగ్ ప్రయాణం మొదలు పెట్టాను. వంద సార్లు పడిపోయాను కానీ ప్రతిసారీ లేచి నిలబడ్డాను. వదిలేద్దాం అని చాలాసార్లు అనుకున్నాను కానీ వదలనందుకు ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. చిన్న స్లోప్ నుంచి పెద్ద టర్న్ దాకా నేను చేసిన ప్రయాణం చాలా స్పెషల్. కష్టంగానే ఉన్నా చాలా సంతోషంగా ఉన్నాను" అని చెప్పింది సమంత. ఇక సినిమాల పరంగా చూస్తే సమంత శాకుంతలం మరియు యశోద సినిమాలతో బిజీగా ఉంది.

admin1

admin1

Next Story