Allu Arha: అల్లు అర్జున్ కూతురు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న సామ్

Allu Arha: "ఆ పాప రాక్ స్టార్ అవ్వడానికే పుట్టింది" అంటున్న సమంత

admin1
Published on: 21 Oct 2021 9:55 PM IST
Samantha Says About Allu Arjun Daughter Allu Arha
X

అల్లు అర్హపై ప్రశంసలు కురిపిస్తున్న సమంత (ఫైల్ ఇమేజ్)

Allu Arha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే గుణశేఖర్ దర్శకత్వంలో "శాకుంతలం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మైతలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత శకుంతల పాత్ర పోషిస్తుండగా, మలయాళ నటుడు దేవ మోహన్ దుష్యంతుడు గా కనిపించబోతున్నారు. అదితి బాలన్, ననాయ నాగల్ల, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ కూడా అరంగేట్రం చేయబోతోంది. నాలుగేళ్ల అర్హ యువరాజు భరత చిన్నప్పటి పాత్రలో కనిపించబోతోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్హ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సమంత. "తను రాక్ స్టార్ అవ్వడానికే పుట్టింది. ఆ పాప గురించి నేను ఇప్పుడు ఏం చెప్పినా అది చాలా తక్కువ అనిపిస్తుంది. సెట్ మీద 200 నుంచి 300 మంది ఉన్నప్పటికీ తను మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉండేది. ఫస్ట్ టేక్ లోనే చాలా బాగా నటించింది. ఆమె తెలుగు కూడా చాలా బాగా మాట్లాడుతుంది. తన డెబ్యూ నాతో చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఇండస్ట్రీలో రాక్ స్టార్ గా మారబోతోంది. సినిమా చూస్తే అది మీకు కూడా అర్థం అవుతుంది అని అన్నారు.

admin1

admin1

Next Story