సమంత "శాకుంతలం" విడుదల వాయిదా పడిందా?

* రిలీజ్ డేట్ ను వాయిదా వేసిన "శాకుంతలం" బృందం

Dhatripriya
Updated on: 1 Feb 2023 8:00 PM IST
Samantha Sakunthalam Release Postponed
X

సమంత "శాకుంతలం" విడుదల వాయిదా పడిందా? 

Shaakuntalam: ఈ మధ్యనే యశోద సినిమాతో మంచి హిట్ అందుకున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత తాజాగా ఇప్పుడు "శాకుంతలం"అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. గుణశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమాని ఫిబ్రవరి 17న మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. కానీ ఇంకా సినిమా ప్రమోషన్లు మొదలవలేదు. ఈ నేపథ్యంలో సినిమాకి గురించిన ఒక షాకింగ్ వార్త ఇప్పుడు నెట్టింట్లో లో వైరల్ గా మారుతుంది. ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కావడం లేదని, సినిమాని చిత్ర బృందం మరింత వాయిదా వేసింది అని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉన్నాయి.

శకుంతల మరియు దుశ్యంతుడి ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా లో మోహన్ బాబు దుర్వాస మహర్షిగా కనిపిస్తుండగా, ప్రకాష్ రాజ్, అదితి బాలన్, అనన్య నాగల్ల, జిషు సేన్ గుప్తా, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణ శేఖర్ కుమార్తె నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

Dhatripriya

Dhatripriya

Next Story