Samantha Ruth Prabhu: నటి సమంత ఇంట తీవ్ర విషాదం..

Samantha Ruth Prabhu Father Joseph Prabhu Passes Away
X

Samantha Ruth Prabhu: నటి సమంత ఇంట తీవ్ర విషాదం..

Samantha Ruth Prabhu: నటి సమంత రుతు ప్రభు తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం మరణించారు. తండ్రి మరణించడంతో ఆమె విచారంలో మునిగిపోయారు. హృదయం ముక్కలైన ఎమోజీని ఆమె తన ఇన్ స్టా లో పోస్టు చేశారు.

నాగ చైతన్యతో సమంత విడిపోయిన తర్వాత జోసెఫ్ ప్రభు వీరిద్దరి పెళ్లి ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. చాలా కాలం క్రితం వరకు ఓ కథ ఉండేది. అది ఇప్పుడు లేదు.. కొత్త కథను ప్రారంభిద్దాం అని ఈ ఫోటోలతో పాటు ఆయన కామెంట్స్ పెట్టారు.

జోసెఫ్ ప్రభు ఆంగ్లో ఇండియన్. ఆయన చెన్నైలో సెటిలయ్యారు. సమంత తల్లి నైనిట్ట సిరియన్ మళయాళీ. జోసెఫ్, నైనిట్టది ప్రేమ వివాహం. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అబ్బాయిలు. ఒక అమ్మాయి. సమంతకు ఇద్దరు అన్నయ్యలు. సమంత సోదరుడు పెళ్లి ఇటీవలనే అమెరికాలో జరిగింది.

సమంతకు మోడలింగ్ పై ఉన్న ఇంట్రెస్టుతో ఆ రంగంలోకి వెళ్లిన సమయంలో కొందరు ఈ విషయంలో నెగిటివ్ గా ప్రచారం చేశారు. అయితే చాలాసార్లు తన కుటుంబ సభ్యులు తనకు అండగా నిలిచారని ఆమె గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story