మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా.. సమంత ఎమోషనల్ పోస్ట్..

Samantha Birthday: నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత తన తొలిపుట్టినరోజును జరుపుకొంటోంది.

Arun Chilukuri
Published on: 29 April 2022 5:05 PM IST
మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా.. సమంత ఎమోషనల్ పోస్ట్..
X

Samantha Birthday: నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత తన తొలిపుట్టినరోజును జరుపుకొంటోంది. నిన్న ఆమె 35వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు సన్నిహితులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు బర్త్ డే విషెష్ తెలియజేశారు. కాగా, తనకి పుట్టినరోజు సంబంధించి విషెస్‌ తెలిపిన వారందరికీ సామ్‌ థ్యాంక్యూ చెప్పారు.

'నా పుట్టినరోజు నాడు మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీ అందరి ప్రోత్సాహం, ప్రేరణ, సానుకూలతలకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినే. మనస్ఫూర్తిగా నేను మీ అందర్నీ ప్రేమిస్తున్నా. ఈ ఏడాదిని మరింత ధైర్యంగా ఎదుర్కొనేందుకు మీరు నాలో ఉత్సాహాన్ని నింపారు'' అని సామ్‌ రాసుకొచ్చారు. ప్రస్తుతం సమంత యశోద సినిమాలో నటిస్తోంది. అలాగే ఇప్పటికే ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ. సమంత జంటగా అందమైన ప్రేమకథా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story