పెళ్లి సమయంలో కట్టుకున్న చీరను సమంత ఏం చేసిందో తెలుసా?

Samantha Wedding Saree: టాలీవుడ్ స్టార్ కపుల్ గా ఉండే సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోవడం ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Arun Chilukuri
Published on: 12 March 2022 4:25 PM IST
Samantha Return her Wedding Saree to Naga Chaitanya
X

పెళ్లి సమయంలో కట్టుకున్న చీరను సమంత ఏం చేసిందో తెలుసా?

Samantha Wedding Saree: టాలీవుడ్ స్టార్ కపుల్ గా ఉండే సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోవడం ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారిద్దరూ మళ్లీ కలిస్తే బాగుంటుందని ప్రార్థించే అభిమానులు కూడా ఉన్నారు. అయితే భార్యాభర్తలుగా విడిపోతున్నప్పటికీ తామెప్పుడూ మంచి స్నేహితుల్లా ఉంటామని సమంత మరియు నాగచైతన్య తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లి సమయంలో సమంత కట్టుకున్న చీర గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2017 అక్టోబర్ 6 న హిందూ మరియు క్రిస్టియన్ పద్ధతులలో సమంత మరియు నాగచైతన్య ఒక్కటయ్యారు.

ఇక పెళ్లి మండపంలో సమంత కట్టుకున్న చీర నాగచైతన్యకు సెంటిమెంట్ అనే విషయం తెలిసిందే. ఎందుకంటే ఆ చీర నాగచైతన్య అమ్మమ్మ మరియు రామానాయుడు భార్య అయిన దగ్గుబాటి రాజేశ్వరి ది. అమ్మమ్మ అంటే చైతన్యానికి చాలా ఇష్టం. ఆమె గుర్తుగా ఆ చీరను రీ మోడల్ చేయించి సమంత కట్టుకుంది. దాని కోసం 40 లక్షలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది? మరి అంతా హిస్టరీ ఉన్నా ఆ చీరని సమంత విడాకుల తర్వాత నాగచైతన్యకి ఇచ్చేసిందని, చై కి సంబంధించిన జ్ఞాపకాలను కూడా మర్చిపోవటానికి ఇలా చేసింది అంటూ కొందరు చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story