Shaakuntalam Movie: గుణశేఖర్‌ను ఆదుకున్న సమంత.. రెమ్యునరేషన్ వెనక్కి..?

Shaakuntalam Movie: గుణశేఖర్‌ను ఆదుకున్న సమంత.. రెమ్యునరేషన్ వెనక్కి..?

Arun Chilukuri
Updated on: 19 April 2023 4:01 PM IST
Samantha Rescues Director Gunasekhar, Returns Remuneration
X

Shaakuntalam Movie: గుణశేఖర్‌ను ఆదుకున్న సమంత.. రెమ్యునరేషన్ వెనక్కి..?

Samantha Remuneration: దర్శకుడు గుణశేఖర్ కాంబినేషన్‌లో స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ పోషించిన శాకుంతలం చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. కాళిదాసు రచించిన అందమైన ప్రేమకావ్యం అభిజ్ఞాన శాకుంతలం వెండితెరపై మెరవలేకపోయింది. తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో మొదటి రోజే డిజాస్టర్ టాక్ రావడం శాకుంతలం టీమ్‌ను బాగా కృంగదీసింది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొదటి రోజు కోటి రూపాయల షేర్‌ని వసూలు చేసిన ఈ సినిమా...ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి రెండు కోట్ల రూపాయల షేర్‌ని రాబట్టింది. ఇక ఇప్పటికే క్లోజింగ్ స్థాయికి వచ్చేసిన ఈ మూవీ ఇప్పటివరకు 5 కోట్ల షేర్‌ని కూడా రాబట్టలేకపోయింది.

శాకుంతలం మూవీ నిర్మాతలకు మరియు బయర్స్‌ కి భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. సమంతను సైతం భారీ డిప్రెషన్ లోకి నెట్టిందనే చెప్పాలి. విజయాలు వస్తుంటాయి...అపజయాలు ఎదురవుతాయి. అయినా కూడా మన పని మనం చేసుకుంటూ వెళ్లాలని సమంత శాకుంతలం ఫలితంపై పరోక్షంగా తన మనసులోని మాటను బయటపెట్టింది. ఎవరి కెరీర్‌లోనైనా ఎత్తు పల్లాలు సహజమని అలా వాటి గురించి ఆలోచిస్తూ ఉండిపోతే జీవితంలో ముందుకు వెళ్లలేమని వేదాంతం పలికింది.

ఇక అసలు విషయానికొస్తే, శాకుంతలం మూవీ కోసం సమంత దాదాపుగా 8 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. సినిమాకి ఘోర ఫలితం ఎదురుకావడంతో తీసుకున్న రెమ్యునరేషన్‌ నుండి 50 శాతం అంటే 4 కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చినట్లు ఫిలింనగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే సమంత తీసుకున్న నిర్ణయానికి అందరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story