Samantha: సమంత అందంపై కామెంట్‌.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సామ్‌..

Samantha: సమంత అందంపై కామెంట్‌.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సామ్‌..

Arun Chilukuri
Published on: 10 Jan 2023 5:17 PM IST
Samantha Reply To Tweet Claiming She Lost Her Charm And Glow
X

Samantha: సమంత అందంపై కామెంట్‌.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సామ్‌..

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఇప్పుడిప్పుడే తనకి సోకిన మయోసైటిస్ అనే వ్యాధి నుంచి కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులు అందరూ సమంతకు అండగా నిలుస్తున్నారు. మరోవైపు సమంత కూడా తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నా చాలా ధైర్యంగా కెరియర్ లో ముందుకు దూసుకుపోతోంది. త్వరలోనే సమంత హీరోయిన్‌గా గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన "శాకుంతలం" అనే సినిమా విడుదలకి సిద్ధమవుతోంది.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సమంత కూడా పాల్గొంది. అయితే తాజాగా సమంత గురించి "సమంత పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది. ఆమె గ్లో మరియు చార్మ్ ఇప్పుడు లేవు. విడాకుల నుంచి చాలా స్ట్రాంగ్ గా బయటకు వచ్చింది అని అందరూ అనుకుంటున్న సమయంలో మయోసైటిస్ సోకి ఆమెను వీక్ చేసింది," అని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి కామెంట్‌ చెశారు. తాజాగా దీనికి సమంత ఇచ్చిన జవాబు అభిమానుల నుంచి ప్రశంసలను అందుకుంటుంది.

"నాలాగా నెలల కొద్దీ మెడికేషన్ తీసుకుంటూ చికిత్స పొందాల్సిన అవసరం మీకు రాకూడదని నేను ప్రార్థిస్తున్నాను. మీ గ్లో పెంచడానికి నా నుంచి కొంత ప్రేమను తీసుకోండి," అంటూ ఒక హార్ట్ సింబల్ ను పెట్టింది సమంత. దీంతో అభిమానులు మళ్లీ సమంతని సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ఒకటి మాత్రం మారదని అదే తనకి సినిమాలపై ఉన్న ప్రేమ అని చెప్పింది సమంత.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story