Akkineni Samantha: సోషల్ మీడియాలో అక్కినేని పేరు తొలిగించిన సమంత.. అసలు కారణం?

Akkineni Samantha: టాలీవుడ్ బ్యూటీ అక్కినేని కోడలు సమంత తన సోషల్‌ మీడియా అకౌంట్లలో ఇంటిపేరు 'అక్కినేని'ని తొలిగించి అందరికీ షాకిచ్చింది.

Arun Chilukuri
Published on: 31 July 2021 2:08 PM IST
Samantha Removes Akkineni Surname in Social Media
X

Akkineni Samantha: సోషల్ మీడియాలో అక్కినేని పేరు తొలిగించిన సమంత.. అసలు కారణం?

Akkineni Samantha: టాలీవుడ్ బ్యూటీ అక్కినేని కోడలు సమంత తన సోషల్‌ మీడియా అకౌంట్లలో ఇంటిపేరు 'అక్కినేని'ని తొలిగించి అందరికీ షాకిచ్చింది. అయితే సడెన్‌గా ఏమైందో తెలియదు కానీ ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి అక్కినేని అనే పదాన్ని తొలిగించి కేవలం 'ఎస్‌' అనే పేరుతో డిస్‌ప్లే పేరును మార్చేసింది. దీంతో సమంత పేరు గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. 'సమంతకి ఏమై ఉంటుంది? ఎందుకు ఇలా పేరు మార్చుకుంది?' అని మొదలుపెట్టి.. నాగచైతన్యతో సామ్‌కు ఉన్న అనుబంధం గురించి కూడా అనుమానాలు వ్యక్తం చేసేలా చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉండగా సామ్‌ అభిమానులు మాత్రం.. 'తన ఇష్టప్రకారం ఆమె పేరు మార్చుకున్నప్పుడు మీకు వచ్చిన సమస్య ఏమిటి? అని కామెంట్లు చేస్తున్నారు. కానీ ఈ విషయం గురించి అసలు కారణం తెలియక పోగా దీని గురించి సమంత ఎప్పుడు చెబుతుందో చూడాలి. ఇక ఇటీవలే ది ఫ్యామిలీ మాన్ 2 అని వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పాన్ ఇండియా మూవీ లో నటిస్తుంది సమంత. ఇక తమిళంలో కూడా ఓ సినిమాలో అవకాశం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పైగా బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story