Samantha: నాగచైతన్య కోసం షారుక్ ఖాన్ ని రిజెక్ట్ చేసిన సామ్

* నాగచైతన్య కోసం సినిమాను వదులుకున్న సమంత

admin1
Updated on: 19 Oct 2021 7:30 PM IST
Samantha Rejects Shah Rukh Khan Movie for Naga Chaitanya
X

నాగచైతన్య కోసం షారుక్ ఖాన్ ని రిజెక్ట్ చేసిన సామ్(ఫైల్ ఫోటో)

Samantha: టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత మరియు నాగచైతన్య ఈ మధ్యనే తమ విడాకులని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి విడాకుల కారణాలు ఇవే అంటూ బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి కానీ వీరిద్దరూ మాత్రం ఈ పుకార్లపై మౌనం వహించారు. అయితే తాజా సమాచారం ప్రకారం సమంత నాగ చైతన్య కోసం తనకి వచ్చిన ఒక అతిపెద్ద సినిమా ఆఫర్ని రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

అప్పటికే "తేరీ", "మెర్సల్" వంటి సూపర్ హిట్ సినిమాలలో సమంతతో కలిసి పనిచేసిన డైరెక్టర్ అట్లీ మొదట ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంతనే సంప్రదించారు. కానీ ఆ సమయంలో సమంత నాగ చైతన్య పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారు. అందుకే సమంత ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసింది సామ్. ఆ తర్వాత ఆ సినిమా నయనతార చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం నయనతార ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ తో ముంబై లో బిజీగా ఉంది. మరోవైపు నాగచైతన్య తో విడిపోయిన సమంత త్వరలోనే "శాకుంతలం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గుణశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

admin1

admin1

Next Story