అందుకే ఎన్టీఆర్ తో నటించే అవకాశాన్ని తిరస్కరించిన సమంత

Samantha Refuses to Work With Jr NTR, here’s why
x

అందుకే ఎన్టీఆర్ తో నటించే అవకాశాన్ని తిరస్కరించిన సమంత

Highlights

రెమ్యూనరేషన్ వల్లే ఎన్టీఆర్ సినిమాకి నో చెప్పిన సమంత

Samantha: నాగచైతన్య తో పెళ్లి తర్వాత చాలా కాలం పాటు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు మాత్రమే చేసిన స్టార్ బ్యూటీ సమంత విడాకుల తర్వాత మళ్లీ తనలోని హాట్ సైడ్ ను ప్రేక్షకులకు చూపించడానికి సిద్ధమైంది. "పుష్ప" సినిమాలో "ఊ అంటావా ఊ ఊ అంటావా" అంటూ ఐటెం సాంగ్ లో యువతను ఉర్రూతలూగించింది సామ్. పుష్ప సినిమా తర్వాత సమంతకి ఉన్న క్రేజ్ బీభత్సంగా పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలోనే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా ఈమెకి ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశాన్ని ఇచ్చారట. కానీ తాజా సమాచారం ప్రకారం సమంత ఈ ఆఫర్ ను తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. #ఎన్టీఆర్30 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను అందుకుంది.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కొరటాల శివ ముందుగా సమంతను సంప్రదించారట. 2.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట. కానీ సమాంత మాత్రం నాలుగు కోట్లు ఇస్తేనే సినిమాలో నటిస్తానని చెప్పిందట. సమంత డిమాండ్ విని నిర్మాత కళ్యాణ్ రామ్ మరియు కొరటాల షాక్ అయ్యారట. అయితే మరోవైపు రష్మిక మందన్న, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్లు కూడా సినిమాకి ఐదు కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories