అతనే సంగీతాన్ని అందించాలి అంటున్న సమంత

*అతనే సంగీతాన్ని అందించాలి అంటున్న సమంత

admin1
Updated on: 28 March 2022 7:01 PM IST
Samantha Recommended Anirudh for the Music for the Film
X

అతనే సంగీతాన్ని అందించాలి అంటున్న సమంత

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, విజయ్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంగీతాన్ని అందించడం కోసం ముందుగా గోపీసుందర్ ను అనుకున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన 'నిన్ను కోరి', 'టక్ జగదీష్' వంటి సినిమాలకు గోపిసుందర్ సంగీతం అందించారు. అలా శివ నిర్వాణకి గోపిసుందర్ తో మంచి స్నేహం ఉంది. అలానే విజయ్ దేవరకొండ సూపర్ హిట్ సినిమా అయిన 'గీత గోవిందం' కి కూడా గోపిసుందరే సంగీతం అందించారు. దీంతో గోపిసుందర్ ని మరోసారి రిపీట్ చేయాలనుకున్నారు. కానీ సమంత మాత్రం దీనికి ససేమిరా ఒప్పుకోలేదని తెలుస్తోంది.

తన స్నేహితుడు, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ని ఈ సినిమా కోసం రికమెండ్ చేసిందట. గతంలో సమంత నటించిన "యూ టర్న్", "ఓ బేబీ" వంటి కోసం స్పెషల్ ట్రాక్ ను కంపోజ్ చేశారు అనిరుధ్. దీంతో ఈ సినిమా కోసం కూడా మ్యూజిక్ కంపోజర్ గా అనిరుధ్ నే తీసుకోవాలని సామ్ చెప్పడంతో దర్శకనిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనిరుధ్ పాటలు ట్యూన్ కట్టడం మొదలుపెట్టారట. మరోవైపు సమంత ఇలా క్రియేటివ్ విషయాల్లో లో తలదూర్చడం కొంతమందికి ఏమాత్రం నచ్చడం లేదట.

admin1

admin1

Next Story