No Entry 2: సల్మాన్ ఖాన్ కోసం సమంత మరియు రష్మిక

Samantha, Rashmika Mandanna To Star In Salman Khans No Entry 2
x

No Entry 2: సల్మాన్ ఖాన్ కోసం సమంత మరియు రష్మిక

Highlights

No Entry 2: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో సమంత మరియు రష్మిక మందన్న లు కూడా ముందే ఉంటారు.

No Entry 2: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో సమంత మరియు రష్మిక మందన్న లు కూడా ముందే ఉంటారు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వరుస సూపర్ హిట్ లతో ముందుకు దూసుకుపోతున్న ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేసేందుకు ఆసక్తి చూపించలేదు అని ఒకప్పుడు వార్తలు కూడా వినిపించాయి. అయితే తాజాగా ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ సినిమా కోసం ఇద్దరూ సైన్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యనే "రాధే" సినిమా లో కనిపించిన సల్మాన్ ఖాన్ తాజాగా ఇప్పుడు పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ హిందీలో సూపర్ హిట్టయిన "నో ఎంట్రీ" అనే సినిమాకి సీక్వెల్ చేయడానికి సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం సౌత్ ఇండస్ట్రీ నుంచి పేరున్న హీరోయిన్ లను ఎంపిక చేస్తున్నారు దర్శక నిర్మాతలు. రష్మీక మందన్న మరియు సమంత లను ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎంపిక చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట.

ఇప్పటికే చిరంజీవి హీరోగా నటిస్తున్న "గాడ్ ఫాదర్" సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించనున్న సల్మాన్ ఖాన్ టాలీవుడ్ లో కూడా తన క్రేజ్ పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో తమన్నా కూడా ఒక ఐటెం సాంగ్ లో కనిపించబోతోందని, ఈ సినిమాలో దాదాపుగా పది మంది హీరోయిన్లు ఉండబోతున్నారు వార్తలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories