Samantha Dating: వెకేషన్‌లో రాజ్ - సమంత.. ఫొటోలు వైరల్‌..

Samantha Dating:  వెకేషన్‌లో రాజ్ - సమంత.. ఫొటోలు వైరల్‌..
x
Highlights

Samantha Dating: నటిని సమంత, ‘ది ఫ్యామిలీమ్యాన్ 2’ దర్శకుడు రాజ్‌ నిడిమోరు గురించి ఇటీవల సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.

Samantha Dating: నటిని సమంత, ‘ది ఫ్యామిలీమ్యాన్ 2’ దర్శకుడు రాజ్‌ నిడిమోరు గురించి ఇటీవల సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. వీరిద్దరూ తరచూ కలుసుకోవడం, కలిసి కనిపించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో, వీరి మధ్య ప్రత్యేకమైన బంధం ఉందంటూ రూమర్లు జోరుగా వినిపిస్తున్నాయి.

తాజాగా సమంత తన అమెరికా వెకేషన్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఫ్రెండ్స్‌తో దిగిన ఆ ఫొటోలలో రాజ్ కూడా ఉండడం మరోసారి చర్చకు దారితీసింది. అంతేకాదు, ‘‘మీరు అదృష్టవంతులు కారు.. మీ కష్టానికి ప్రతిఫలం వచ్చింది’’ అనే క్యాప్షన్‌ను సమంత జత చేయడం గమనార్హం. దీనిపై కొంతమంది అభిమానులు ‘‘కంగ్రాట్స్’’ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

గతంలో రాజ్-డీకే రూపొందించిన ‘ది ఫ్యామిలీమ్యాన్ 2’, ‘సిటడెల్: హనీ బన్నీ’ వెబ్‌సిరీస్‌లలో సమంత నటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రాజ్‌తో ఆమె స్నేహం పెరిగిందని టాక్. తాజాగా సమంత నిర్మించిన ‘శుభం’ అనే చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.

ఇక ఇటీవల తన గురించి వస్తున్న గాసిప్స్‌ నేపథ్యంలో సమంత ఓ సందేశాత్మక పోస్ట్‌ కూడా షేర్ చేశారు. ‘‘ఇతరుల మాటలకీ, ఊహగానాలకీ స్పందించకుండా, ప్రశాంతత కోసం నిరంతరం సాధన చేయాలి. జరగాల్సినదాన్ని అడ్డుకోవద్దు.. ప్రశాంతతను ఆస్వాదించాలి’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ ప్రచారం ఎంతవరకూ నిజమో, లేదా పుకారేనా అన్నది మాత్రం అధికారికంగా ఎవరి నుండి స్పష్టత రావాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories