Samantha: షాకింగ్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న సమంత

Samantha: షాకింగ్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న సమంత

admin1
Updated on: 9 March 2022 10:00 AM IST
Samantha Raising Remuneration | Telugu Movie News
X

Samantha: షాకింగ్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న సమంత

Samantha: టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో సమంత పేరు ముందే ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకి రెమ్యునరేషన్ పెంచుతూ వస్తున్నట్టు తెలుస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ ట్యాగ్ నుంచి బయటపడి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా సూపర్ హిట్లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్న సమంత ఈ మధ్యనే రాజీ పాత్రలో కూడా అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా ఇప్పుడు శాకుంతలం, యశోద సినిమాలతో బిజీగా ఉంది సమంత. ఈ నేపథ్యంలో సమంత తీసుకునే రెమ్యునరేషన్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యశోద సినిమాకి సమంత మూడు కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం 30 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలింగ ప్రసాద్ కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హరీష్ శంకర్, హరీష్ నారాయణ ఈ సినిమాని కి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఓ సినిమా కోసం సమంత మూడు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇక సమంత "పుష్ప" లో చేసిన స్పెషల్‌ సాంగ్‌కి కూడా కోటిన్నర పారితోషికంగా అందుకున్నట్టు సమాచారం.

admin1

admin1

Next Story