నాగ చైతన్య తో క్లాష్ వద్దు అనుకున్న సమంత

Samantha postponed her film for Naga Chaitanya | Tollywood
x

నాగ చైతన్య తో క్లాష్ వద్దు అనుకున్న సమంత

Highlights

*నాగ చైతన్య తో క్లాష్ వద్దు అనుకున్న సమంత

Samantha-Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్గా నటిస్తున్న "యశోద" సినిమా ఆగస్టు 12 న థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది. అయితే దానికి ముందు రోజున అంటే ఆగస్టు 11న సమంత మాజీ భర్త అక్కినేని నాగచైతన్య ముఖ్య పాత్ర పోషించిన బాలీవుడ్ సినిమా "లాల్ సింగ్ చద్దా" కూడా విడుదల కాబోతోంది. ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న "లాల్ సింగ్ చద్దా" సినిమాతో నాగచైతన్య బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.

ఇక బాక్స్ ఆఫీస్ వద్ద వీరిద్దరి సినిమాలు క్లాష్ అవ్వబోతున్నాయి అని వార్తలు వినిపిస్తుండగా సమంత తన సినిమాని వాయిదా వేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే "యశోద" సినిమా షూటింగ్ పూర్తయింది కానీ ఇంకా ఒక పాట చిత్రీకరణ మాత్రం పెండింగ్లో ఉంది. మరోవైపు గ్రాఫిక్స్ పనులు కూడా ఇంకా పూర్తి కావాల్సి ఉందట. ఇక ఈనెల 15వ తేదీ నుంచి సినిమా డబ్బింగ్ పనులు మొదలవుతాయి.

ఫుల్ లెన్త్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం మరియు కన్నడ భాషలో విడుదల కాబోతోంది. హరి - హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తాజాగా సినిమా వాయిదా పడుతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories