Samantha Akkineni: ముంబైకి సమంత...మరి చైతూ?

Samantha Akkineni: సమంత ముంబైలో ఖరీదైన ఇల్లును కొనబోతున్నట్లు ఇండ్రస్టీ లో టాక్ నడుస్తోంది.

Kranthi
Updated on: 8 July 2021 10:55 AM IST
Samantha Plans to Buy a Flat in Mumbai
X

Samantha 

Samantha Akkineni: టాలీవుడ్ టాప్ హీరోన్స్ లో ఒకరై సమంత అక్కినేని ముంబైకి షిప్టు అవుతోందా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్2 వెబ్ సిరీస్ తరువాత హిందీ నుంచి సినిమా ఆఫర్స్ జోరుగా వస్తున్నాయట. ఈ క్రమంలో ముంబైలో ఫ్లాట్ కొనుగోలు చేయాలని సామ్ టీమ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ ముంబైలో కాస్ట్‌లీ బంగ్లా కొని హెడ్ లైన్స్‌ లో నిలిచారు. అంతేకాదు ఇంటి గృహ ప్రవేశం కూడా పూర్తైందని సమాచారం. ఇక ఇప్పుడు సమంత కూడా ముంబైలో ఫ్లాట్ కొనుగోలు చేస్తున్నారట

ఇక ప్రస్తుతం సమంత తెలుగుల.. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం అనే చిత్రంలో నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హిందీలోను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో పాటు సమంత ఓ తమిళ సినిమాలోను నటిస్తున్నారు. కవాతుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తున్నారు. నయనతార, విజయ్ సేతుపతి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకుడు. టాలీవుడ్ లోనూ తన జోరును కొనసాగిస్తుందా లేదా రెండు పడవల మీద కాళ్లు పెట్టి తన ప్రయాణం కొనసాగిస్తుందో వేచి చూడాల్సిందే.

Kranthi

Kranthi

Next Story