Samantha: అఖిల్‌ బర్త్‌డే రోజు ఆసక్తికర పోస్ట్‌ చేసిన సమంత..

Samantha: టాలీవుడ్ బ్యూటీ సమంత ఈ మధ్యనే నాగచైతన్య తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 9 April 2022 7:30 PM IST
Samantha Pens a Sweet Note to Akhil Akkineni on his Birthday
X

Samantha: అఖిల్‌ బర్త్‌డే రోజు ఆసక్తికర పోస్ట్‌ చేసిన సమంత..

Samantha: టాలీవుడ్ బ్యూటీ సమంత ఈ మధ్యనే నాగచైతన్య తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత సమంత అక్కినేని కుటుంబానికి దూరంగా ఉంటుందని, ఈ నేపథ్యంలోనే తను పెళ్లి రోజున కట్టుకున్న చీరను కూడా నాగచైతన్యకు తిరిగి ఐచ్చేసినట్లుగా వార్తలు వినిపించాయి. అయితే తాజాగా అక్కినేని అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్యనే "మజిలీ" సినిమా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగచైతన్యతో దిగిన ఒక ఫోటో ని షేర్ చేసి షాకిచ్చిన సమంత ఇప్పుడు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఇంస్టాగ్రామ్ లో విష్ చేసింది.

"హ్యాపీ బర్త్డే అఖిల్. ఈ సంవత్సరం మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ" అని అఖిల్ ఫోటో ని సైతం షేర్ చేసింది సమంత. దీంతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా మాజీ భర్త కుటుంబంతో సమంత చక్కని రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం అందరికీ షాక్ ఇస్తోంది. ఇక సినిమాల పరంగా చూస్తే సమంత గుణశేఖర్ డైరెక్షన్లో "శాకుంతలం" అనే సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమా తర్వాత సమంత "యశోద" అనే మరొక ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో కనిపించనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story