Pawan Kalyan New Movie: హరీశ్.. పవన్ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా?

Pawan Kalyan New Movie: హరీశ్ శంకర్, పవన్ కళ్యాణ్ సినిమాలో మరోసారి సమంత జోడీ కట్టనుంది అని టాలీవుడ్ టాక్.

Kranthi
Published on: 13 Jun 2021 12:34 PM IST
Samantha Pairing With Pawan Kalyan in New Movie Once Again?
X

Pawan Kalyan-Samantha: (File Image)

Pawan Kalyan New Movie: టాలీవుడ్ లో రోజూ పవన్ కల్యాణ్ గురించి ఏదో ఒక వార్త రాకపోతే పవన్ అభిమానులకు నిద్రపట్టడం లేదు. వారి క్రేజీకి తగ్గట్టే రోజూ ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. గబ్బర్ సింగ్ కాంబో అంటేనే క్రేజ్.. ఆ కాంబోలో ఇప్పుడు మరో సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా పోస్టర్ అంటూ అభిమానులే ఒకటి రిలీజ్ చేసి వైరల్ చేసేశారు కూడా. ఇప్పుడు లేటస్టుగా అదే సినిమాకు సంబంధించి మరో తోపు వార్త వచ్చేసింది.

అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్, సమంత ఇద్దరూ కలిసి ఇరగదీసేశారు. చిట్టిగుండె కొట్టుకుంటది అంటూ రొమాన్స్ ఓ రేంజ్ లో పండించారు. ఇప్పుడు మళ్లీ వారి కాంబినేషన్ రిపీట్ అయ్యే ఛాన్స్ కనపడుతోంది. హరీష్ శంకర్ పవన్ కాంబోలో వచ్చే మూవీలో సమంతను హీరోయిన్ గా పెట్టాలనుకుంటున్నట్లు టాక్. అయితే ఇప్పటికే ఫ్యామిలీమ్యాన్ సిరీస్ తో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న సమంత.. చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. అందుకే ఈ సినిమాకు రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేసిందంట. అన్నీ ఓకె అయితే సమంత పవన్ తో మళ్లీ జోడీ కట్టడం ఖాయమే.. ఒకవేళ అది కుదరకపోతే.. ఏ హీరోయిన్ కి ఆ ఛాన్స్ దక్కుతుందో చూడాలి మరి.

Kranthi

Kranthi

Next Story