Samantha: ఆ సమయం చాలా కష్టంగా సాగింది.. విడాకులపై పరోక్షంగా స్పందించిన సమంత

Samantha: టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరు పొందిన సమంత (Samantha), అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya).

Shekhar G
Published on: 20 Feb 2024 5:54 PM IST
Samantha On Her Split From Naga Chaitanya And Health Issues: “It was an extremely difficult year”
X

Samantha: ఆ సమయం చాలా కష్టంగా సాగింది.. విడాకులపై పరోక్షంగా స్పందించిన సమంత

Samantha: టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరు పొందిన సమంత (Samantha), అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). ఐదు సంవత్సరాలకు పైగా రిలేషన్షిప్ లో వుంది. పెళ్లి చేసుకున్న నాలుగు సంవత్సరాలకి తమ వైవాహిక బంధానికి 2021 ముగింపు పలుకుతూ తమ సోషల్ మీడీయా వేదికగా తెలిపిన విషయం మనకి తెలిసిందే. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతున్నారు. సామ్‌.. గత కొన్ని రోజులుగా మయోసైటిస్‌ (Myositis)తో బాధపడుతున్న విషయం తెలిసిందే.

ఆ వ్యాధితో పోరాడుతూనే అప్పటికే కమిట్ ఐన సినిమాలు అన్ని పూర్తిచేసింది. ఇపుడు హాలీవుడ్ సిరీస్ ఇంకా బాలీవుడ్ లోను వరుణ్ ధవన్ తోను ఒక సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునేందుకు సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకోని ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి సారించింది. అనారోగ్య సమస్యల గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు తన యూట్యూబ్ ఛానల్ లో టేక్ 20 (Take 20) అనే ఒక పాడ్ కాస్ట్ కూడా ప్రారంభించింది.

అందులో తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా పంచుకున్నారు. అందులో భాగంగానే నాగ చైతన్యతో విడాకుల గురించి కూడా పరోక్షంగా గుర్తు చేసుకుంది. మయోసైటిస్‌ వ్యాధి రావడానికి సరిగ్గా ఏడాది ముందు తనకు ఎంతో కష్టంగా గడిచిందని (extremely difficult) తెలిపింది. అప్పుడు నాకు బాగా గుర్తుంది. నేను నా మేనేజర్‌ హిమాంక్‌తో కలిసి ముంబై నుంచి తిరిగి వెళ్తున్నా సమయంలో నాకు చాలా ప్రశాంతంగా, రిలాక్స్‌డ్‌గా అనిపిస్తోందని తనతో చెప్పాను.

నేను ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను, తృప్తిగా నిద్రపోగలుగుతున్నాను, లేచి నా పనిపై దృష్టి పెట్టగలుగుతున్నాను అని అనిపించే లోపే ఈ అనారోగ్యం నాపై దాడి చేసినట్లు తెలిసింది’ అంటూ సామ్‌ చెప్పుకొచ్చింది.మయోసైటిస్‌ రావడానికి సరిగ్గా ఏడాది ముందు సమంత.. చైతన్యతో విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దాన్ని ఉద్దేశించే సామ్‌ అప్పుడు చాలా కష్టంగా గడిచిందని అంటూ పరోక్షంగా చెప్పుకొచ్చినట్లుంది.


Shekhar G

Shekhar G

Next Story