Samantha New Movie: యశోద గా మారబోతున్న సమంత

Samantha New Movie: ఆసక్తికరమైన టైటిల్ తో సమంత

admin1
Updated on: 7 Dec 2021 12:16 PM IST
Samantha’s New Movie has Been Titled Yashoda
X

ఆసక్తికరమైన టైటిల్ తో సమంత (ఫైల్-ఫోటో)

Samantha New Movie: స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో "శాకుంతలం" అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సమంత ఇప్పుడు శాకుంతలం సినిమాతో మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు సమంత మరొకసారి ఫిమేల్ సెంట్రిక్ నీ సైన్ చేశారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. వారి నిర్మాణ సంస్థ నుండి రాబోతున్న 14 వ సినిమా ఇది.

తాజాగా ఈ సినిమాకి "యశోద" అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సోమవారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది. మార్చ్ దాకా చిత్ర షూటింగ్ సాగనుంది. హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగులో మాత్రమే కాక తమిళ్, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది ఒక థ్రిల్లర్ అని, ఆద్యంతం ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెప్పారు శివలెంక కృష్ణప్రసాద్.

admin1

admin1

Next Story