logo
సినిమా

Samantha: సమంత ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన మేనేజర్

Samantha Manager Clarifies About her Health Condition
X

సమంత ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన మేనేజర్

Highlights

* సమంత బాగానే ఉంది అంటున్న మేనేజర్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్‌ సమంత ఆరోగ్య పరిస్థితి పై ఆమె మేనేజ‌ర్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. సమంత బాగానే ఉన్నారని కానీ నిన్న కొంచెం దగ్గు రావడం తో హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఏఐజీ ఆస్పత్రి లో పరీక్షలు చేయించుకున్నార‌ని ఆమె మేనేజ‌ర్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఆమె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోందని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా స‌మంత ఆరోగ్యం పై వస్తున్న వదంతులు ఏమాత్రం నమ్మవద్దని అందులో నిజాలు లేవని సమంత మేనేజర్ అభిమానులను కోరారు.

ప్ర‌స్తుతం స‌మంత ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని తెలియజేశారు. సమంత ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంద‌ని, జ్వ‌రం, వాంతులు ఇత‌ర ఇన్ ఫెక్ష‌న్ల తో బాధ‌పడుతున్న‌ట్లు వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. దీంతో అభిమానులు కంగారు పడగా, మేనేజ‌ర్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సినిమాల జోరు పెంచేసిన సమంత ఒకవైపు తెలుగులో మాత్రమే కాక బాలీవుడ్, హాలీవుడ్ లో సైతం తన సత్తా చాటే ప్రయత్నాలతో బిజీగా ఉంది. ఇక సమంత హీరోయిన్గా నటించిన "శాకుంతలం" సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.

Web TitleSamantha Manager Clarifies About her Health Condition
Next Story