సమంత సెన్సేషనల్ కామెంట్స్.. చైతూతో నా ప్రేమ బంధం, స్నేహ బంధం పదిలం..

Samantha Makes Shocking statement After Divorce from Naga Chaitanya
x

సమంత సెన్సేషనల్ కామెంట్స్.. చైతూతో నా ప్రేమ బంధం, స్నేహ బంధం పదిలం..

Highlights

Samantha: టాలీవుడ్ బ్యూటీ సమంతా రుత్ ప్రభు సంచలన వ్యాఖ్యలు చేసింది.

Samantha: టాలీవుడ్ బ్యూటీ సమంత రుత్ ప్రభు సంచలన వ్యాఖ్యలు చేసింది. నాగచైతన్యతో తన విడాకుల తర్వాత తాను చాలా బలహీనంగా మారిపోయినట్లు ఒక దశలో చనిపోతాననుకున్నానని చెప్పింది. అయితే విడాకుల తర్వాత తాను మరింత పుంజుకున్నట్లు మరింత బలంగా, శక్తివంతంగా తయారైనట్లు తెలిపింది. తాను ఊహించనంత ఆత్మవిశ్వాసం, బలం తనలో పెరిగాయని సమంత కామెంట్ చేసింది. ఇప్పుడు తనను చూసి తానే గర్వపడుతున్నానని, చైతన్యతో తన పదేళ్ల ప్రేమ బంధం, నాలుగేళ్ల పెళ్లి బంధం అలాగే పదిలంగా ఉంటాయని ఫ్యాన్స్ తమకు ప్రైవసీ ఇవ్వాలనీ ఈ బ్యూటీ కోరింది.

ప్రతీ వ్యక్తికి మంచి, చెడు రెండు రోజులూ వస్తాయని తట్టుకుని నిలబడగలగడమే పరీక్ష అనీ సామ్ వ్యాఖ్యానించింది. డైవోర్స్ తర్వాత తన కెరీర్ పై దృష్టి పెట్టిన సామ్ గుణ శేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా పూర్తి చేసేసింది. పుష్ప సినిమాలో ఓ ఐటెం సాంగ్ పూర్తి చేయడంతోపాటు, మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పింది. హాలీవుడ్ లో అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ అనే ఓ మూవీలో లీడ్ రోల్ లో నటిస్తోంది. సమంత కామెంట్స్ తో ఆమె ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories