Samantha: శాకుంతలం" సినిమా గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత..

Samantha: "సినిమా చూశాక గుణశేఖర్ గారి కాళ్ళ మీద పడ్డాను," అంటున్న సమంత

Jyothi
Updated on: 10 Jan 2023 10:00 AM IST
Samantha made Shocking Comments while talking about the Movie Shaakuntalam
X

Samantha: శాకుంతలం" సినిమా గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత..

Samantha: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటించిన సినిమా "శాకుంతలం". ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇవాళ ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ సమంత గుణశేఖర్ గురించి కొన్ని ఆసక్తికరమైన ఆ విషయాలను తెలియజేసింది.

"కొంతమంది ఫిలిం మేకర్లు సినిమాని ప్రేమిస్తారు కానీ గుణశేఖర్ గారికి సినిమానే జీవితం. సినిమానే తనకు అన్నీ. శాకుంతలం నా అంచనాలకు మించి చాలా బాగా వచ్చింది. సినిమా చూశాక నేను గుణశేఖర్ గారి కాళ్ళ మీద పడి కృతజ్ఞతలు చెప్పాను," అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది సమంత. ఈ మధ్యనే మయోసైటిస్ అనే వ్యాధి తో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సమంత ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ, "మీ అందరూ సినిమాపై చూపించే ప్రేమను చూడటానికే నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను," అని అభిమానుల గురించి కూడా చెప్పుకొచ్చింది సమంత.

"భారతదేశ సాహిత్య చరిత్రలో శకుంతల ఒక మర్చిపోలేని పాత్ర. ఐదవ సెంచరీ లో కాళిదాస రచించిన ఈ పాత్ర ను నేను పోషించటం నిజంగా నా అదృష్టం," అని సినిమాపై కూడా ప్రశంసల వర్షం కురిపించేసింది సమంత. అంతేకాకుండా చిత్ర నిర్మాత దిల్ రాజు గురించి మాట్లాడుతూ, "ప్రొడక్షన్ కాస్ట్ గురించి ఏ మాత్రం కంగారు పడకుండా దిల్ రాజు చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశారని, అది కేవలం సినిమాపై ఆయనకు ఉన్న ప్రేమ వల్ల మాత్రమే," అని అంటుంది సామ్.

Jyothi

Jyothi

Next Story