ఎన్టీఆర్ తో నటించే అవకాశం కోల్పోయిన సమంత

Samantha Lost the Chance to Act with NTR
x

ఎన్టీఆర్ తో నటించే అవకాశం కోల్పోయిన సమంత

Highlights

Samantha: ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమలో ఐటమ్ సాంగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన సమంత..

Samantha: ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమలో ఐటమ్ సాంగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన సమంత ఒకవైపు బాలీవుడ్లో అవకాశాలు వెతుక్కుంటూనే మరోవైపు తెలుగులో కూడా సినిమాలు సైన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ అవకాశం వచ్చిందట. కానీ దురదృష్టవశాత్తు సమంత డేట్లు ఎడ్జస్ట్ కాకపోవడంతో సైన్ చేయలేకపోయింది.

నిజానికి కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న #ఎన్టీఆర్30 సినిమా కోసం సమంత ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ అదే సమయంలో "ది ఫ్యామిలీ మ్యాన్" వెబ్ సిరీస్ చేస్తున్న సమంత హిందీలో మరొక సినిమాని కూడా సైన్ చేసింది. కానీ డేట్ లు కుదరకపోవడంతో ఎన్టీఆర్ తో నటించే అవకాశాన్ని సమంతకు వదులుకోవాల్సి వచ్చింది.

చాలాకాలం తర్వాత ఒక స్టార్ హీరో తో నటించే అవకాశం వచ్చినప్పటికీ అది కుదరలేదు. ఇక ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో "శాకుంతలం" అనే సినిమాలో నటిస్తున్న సమంత "యశోద" అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తో కూడా బిజీ గా ఉంది. మరోవైపు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న "ఖుషి" సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది సమంత. శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories