Samantha: పెళ్లిళ్ల పేరమ్మగా సమంత కొత్త అవతారం..

Samantha Looking For Suitable Match For her Doctor
x

Samantha: పెళ్లిళ్ల పేరమ్మగా సమంత కొత్త అవతారం..

Highlights

Samantha: ఓ వైపు మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటూనే మరోవైపు పలు చిత్రాల్లో నటిస్తూ సమంత ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా సమంత తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన స్టోరీ వైరల్ గా మారింది.

Samantha: అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత కొంత కాలం సైలెంట్ గా ఉన్న సమంత మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసినట్లే కనిపిస్తోంది. గతంలో మాదిరి సోషల్ మీడియాలో సామ్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తోంది. ఓ వైపు మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటూనే మరోవైపు పలు చిత్రాల్లో నటిస్తూ సమంత ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా సమంత తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన స్టోరీ వైరల్ గా మారింది.

బాలీవుడ్ సెలబ్రిటీ డాక్టర్ జ్యువెల్ గమాడియాకు సూటబుల్ మ్యాచ్ కావాలని సమంత తన పోస్ట్ లో పేర్కొంది. ఇన్ స్టా స్టోరీలో జ్యువెల్ ఫోటో షేర్ చేసిన సమంత...డాక్టర్ జ్యువెల్ గమాడియాకు సరైన మ్యాచ్ కోసం వెతుకుతున్నాను..అతను బయటకు కనిపించినదాని కంటే చాలా తెలివైనవాడు...దానికి నేను గ్యారెంటీ అంటూ సమంత క్యాప్షన్ యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

సమంత పోస్ట్ తో జ్యువెల్ గమాడియా ఎవరని పలువురు ఆరా తీస్తున్నారు. ఈయన మరెవరో కాదు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీస్ కు గో-టూ డాక్టర్. అనుష్క శర్మ, కత్రినా కైఫ్, అజయ్ దేవగన్ సహా పలువురు సెలబ్రిటీస్ కు వెస్ట్రన్ ఆక్యుపంక్చర్ ఉపయోగించి జ్యువెల్ గమాడియా ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ జాబితాలో సమంత కూడా చేరినట్లు ఉంది.

సమంత చేసిన తాజా పోస్ట్ ను బట్టి జ్యువెల్ గమాడియా వద్ద చికిత్స తీసుకుంటున్నట్లు ఉంది. ఇక సమంత చేసిన పోస్ట్ పై నెటిజన్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది, నాగచైతన్యతో బ్రేకప్ అయినా సరే సమంతకు వివాహ వ్యవస్థపై నమ్మకం తగ్గలేదని అంటున్నారు. మరికొంతమంది అయితే సమంత సెకండ్ మ్యారేజ్ గురించి ఆలోచిస్తుందా అని డౌట్ రైజ్ చేశారు. ఇంకొంతమందైతే...సమంత పెళ్లిళ్ల పేరమ్మగా బాలీవుడ్ లో సరికొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories