Samantha: కొత్త మేనేజర్ ని వెతుక్కుంటున్న సమంత

Samantha: 12 ఏళ్లుగా ఉన్న మానేజర్ ను మార్చేసిన సమంత

admin1
Updated on: 6 April 2022 12:40 PM IST
Samantha Looking for a New Manager | Tollywood News
X

Samantha: కొత్త మేనేజర్ ని వెతుక్కుంటున్న సమంత

Samantha: టాలీవుడ్ బ్యూటీ సమంత ఇప్పటికి ఇండస్ట్రీలో హీరోయిన్ గా మారి దాదాపు పన్నెండేళ్ల అయింది. తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు సమంత పక్కన ఉన్న ఒకే ఒక్క మేనేజర్ మహేందర్. పదేళ్లకు పైగానే వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగింది. సమంత తో పాటే ఏం మరి కొంత మంది హీరోయిన్లకు కూడా మహేందర్ మేనేజర్గా పనిచేశారు. సమంత తన వద్ద ఉండి అందరినీ సొంత మనుషుల చూసుకుంటుంది అని అందరికీ తెలిసిన సంగతే.

మహేందర్ ని కూడా సమంత ఇంటి మనిషి లాగానే చూసుకునేది. కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు వీరిద్దరి మధ్య పేచీ వచ్చిందని తెలుస్తోంది.తాజా సమాచారం ప్రకారం మహేందర్ సమంత వద్ద నుంచి బయటకు వచ్చేశారు అని, సమంత ఇప్పుడు తన కోసం ఒక కొత్త మేనేజర్ ని వెతుక్కునే పనిలో పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీని వెనుక ఉన్న కారణాలు తెలియదు కానీ గత 12 ఏళ్లుగా సమంత ను నడిపించిన మహేందర్ ఎందుకు వెళ్ళిపోయాడు అని తెలియాల్సి ఉంది. దాదాపు హీరోయిన్లు తమ మానేజర్ లన్నీ మార్చడానికి ఏమాత్రం ఇష్టపడరు. అలాంటిది సమంత పన్నెండేళ్లుగా తనతో ఉన్న మహేందర్ ను ఎలా వదులుతుంది అని అభిమానులు సైతం షాక్ అవుతున్నారు.

admin1

admin1

Next Story