డిజిటల్ ప్లాట్ఫామ్ పై విడుదల కాబోతున్న సమంత తమిళ్ సినిమా

* డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల కాబోతున్న "కాతువాకుల రెండు కాదల్"

admin1
Updated on: 2 Oct 2021 7:31 PM IST
Samantha Kaathu Vaakula Rendu Kadhal Movie is Planning to Release in OTT
X

ఓటీటీ లో విడుదల కాబోతున్న "కాతువాకుల రెండు కాదల్" (ఫైల్ ఫోటో)

Kaathu Vaakula Rendu Kadhal Movie: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న తమిళ్ సినిమా "కాతువాకుల రెండు కాదల్". లేడీ సూపర్ స్టార్ నయనతార మరియు సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. విఘ్నేష్ శివన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు విజయ్ సేతుపతి నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన "నానుం రౌడీ దాన్" కి దర్శకత్వం వహించిన విఘ్నేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. విఘ్నేష్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి మరియు నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన నటిస్తున్న రెండవ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా థియేటర్లలో విడుదల అవుతుందా లేక డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలవుతుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. చిత్ర బృందం పోటీలో విడుదల చేయాలని నిర్ణయించిందట. అతి త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా స్క్రీన్ కాబోతోంది. సమంత మరియు నయనతార రౌడీ పిక్చర్స్ మరియు 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకాలపై నిర్మించిన ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.

admin1

admin1

Next Story