Samantha: రష్మిక, కాజల్ తర్వాత మూడవ స్థానాన్ని అందుకున్న సమంత

* మూడవ స్థానాన్ని అందుకున్న సమంత

admin1
Updated on: 4 Dec 2021 10:54 AM IST
Samantha is the Third South Indian Actress to Reach 20 Million Followers in Instagram
X

సమంత (ఇంస్టాగ్రామ్ ఫోటో)

Samantha: తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ఇటు బాలీవుడ్లో కూడా స్టార్ బ్యూటీ సమంత క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది. ఈ మధ్యనే "ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2" సిరీస్ లో కనిపించిన సమంత హిందీ ప్రేక్షకులను కూడా తన అద్భుతమైన నటనతో బాగా ఆకట్టుకుంది. ఇక తెలుగు హిందీ మాత్రమే కాక ఇప్పుడు ఏకంగా హాలీవుడ్లో సైతం అడుగుపెట్టడానికి సిద్ధమైంది సమంత. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్స్ జాన్స్ దర్శకత్వం వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫిలిం "అరేంజ్డ్ లవ్" సినిమాలో సమంతా కీలక పాత్ర పోషించనుంది.

ఇక సోషల్ మీడియాలో కూడా సామ్ హవా బాగానే నడుస్తుంది. ఇంస్టాగ్రామ్ లో 20 మిలియన్ ఫాలోవర్స్ కంటే ఎక్కువ సంపాదించుకున్న మూడవ సౌతిండియన్ నటిగా పేరు తెచ్చుకుంది సమంత. ఈ జాబితాలో మొట్టమొదట ఉన్న పేరు రష్మిక మందన్న. 24 మిలియన్ ఫాలోవర్ లతో రష్మీక మొదటి స్థానం ఆక్రమించగా 20.2 మిలియన్ ఫాలోవర్స్ లతో కాజల్ అగర్వాల్ రెండవ స్థానాన్ని దక్కించుకుంది. తాజాగా 20 మిలియన్ దాటిన సమంత ఇప్పుడు మూడవ స్థానాన్ని సంపాదించింది. ఇక సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యనే గుణశేఖర్ దర్శకత్వంలో "శాకుంతలం" సినిమాతో బిజీగా ఉన్న సమంత అల్లు అర్జున్ "పుష్ప" సినిమాలో ఐటమ్ సాంగ్ లో కూడా కనిపించబోతోంది.

admin1

admin1

Next Story