Samantha: కాశ్మీరీ అమ్మాయి పాత్రలో సమంత

Samantha: సమంత విజయ్ దేవరకొండ సినిమా కి ముహూర్తం ఫిక్స్

admin1
Updated on: 20 April 2022 9:00 AM IST
Samantha in the Role of a Kashmiri Girl in the Vijay Devarakonda Movie
X

Samantha: కాశ్మీరీ అమ్మాయి పాత్రలో సమంత

Samantha: ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత రొమాంటిక్ సైడ్ చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తన తదుపరి సినిమాలలో కూడా అదే ట్రెండ్ ని కంటిన్యూ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె నటిస్తున్న "శాకుంతలం" మరియు "కన్మని రాంబో కతీజ" సినిమాలలో కాకుండా విజయ్ దేవరకొండ హీరో నటిస్తున్న సినిమాలో కూడా సమంత తన రొమాంటిక్ పోతున్న సైడ్ చూపించబోతున్ననట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మరియు సమంత పాత్రల గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. అలాగే ఈ సినిమాలో సమంతా ఒక కాశ్మీరీ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 23 నుంచి మొదలు కాబోతుంది.

ఏప్రిల్ 21 న ఈ సినిమాకి సంబంధించిన ముహూర్తం ఈవెంట్ అని ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. "మహానటి" సినిమా తర్వాత విజయ్ దేవరకొండ మరియు సమంత కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. ఇక ఈ సినిమా కేవలం రెండు నెలల్లోనే పూర్తిచేసి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story