Samantha: లీకులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సమంత

Samantha: మాస్ స్టెప్పులతో ఇంప్రెస్స్ చేసిన సమంత

admin1
Published on: 18 Dec 2021 12:21 PM IST
Samantha Impressed the Fans with the Item Song in the Pushpa Movie | Tollywood News
X

 మాస్ స్టెప్పులతో ఇంప్రెస్స్ చేసిన సమంత(ఫైల్-ఫోటో)

Samantha: నిజానికి ఏదైనా సినిమా విడుదలైన తర్వాత కూడా ఆ సినిమాకి సంబంధించిన ఏవైనా క్లిప్స్ బయటకు లీక్ అయితే పైరసీ అంటూ సెలబ్రిటీలు గోలగోల చేస్తారు. కానీ చూస్తూ ఉంటే ఈ చిన్న చిన్న క్లిప్స్ వల్ల స్టార్ బ్యూటీ సమంత ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ మధ్యనే సమంత తన కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా ఒక ఐటం సాంగ్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విడుదలైన "పుష్ప" సినిమాలో అల్లు అర్జున్ సరసన "ఊ అంటావా ఊ ఊ అంటావా" అనే ఐటమ్ సాంగ్లో బన్నీతో కలిసి స్టెప్పులేసింది సమంత.

కొన్ని మాస్ థియేటర్లలో ఈ పాట వచ్చినప్పుడు కొందరు అభిమానులు సమంత బన్నీ లతో పాటు కలిసి థియేటర్లలో స్టెప్పులేశారు. దీన్ని కొందరు మొబైల్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నారు. అవి ఇంటర్ నెట్ లో వైరల్ గా మారాయి.

సమంత అభిమానులు కూడా ఆ వీడియో క్లిప్ లను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఒకవైపు సినిమా అంతంత మాత్రం గానే ఉందని అభిమానులు నిరాశ చెందుతుంటే మరోవైపు తన చిట్టి పొట్టి డ్రెస్సుల తో ఎక్స్పోజింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది సమంత.

admin1

admin1

Next Story