నాగచైతన్య పై వచ్చే రూమర్స్ నిజాలు కాదా అంటూ నిలదీసిన సమంత

Samantha Tweet: "ఇకపై మేము భార్య భర్తలు గా విడిపోవాలని నిర్ణయించుకుంటున్నాము" అంటూ టాలీవుడ్ స్టార్ కపుల సమంత మరియు నాగచైతన్య తమ విడాకుల గురించి ప్రకటించిన విషయం తెలిసిందే.

Arun Chilukuri
Published on: 21 Jun 2022 4:12 PM IST
Samantha Hits Back PR Team Created Naga Chaitanya-Sobhita Dhulipalas Dating Rumour
X

నాగచైతన్య పై వచ్చే రూమర్స్ నిజాలు కాదా అంటూ నిలదీసిన సమంత

Samantha Tweet: "ఇకపై మేము భార్య భర్తలు గా విడిపోవాలని నిర్ణయించుకుంటున్నాము" అంటూ టాలీవుడ్ స్టార్ కపుల సమంత మరియు నాగచైతన్య తమ విడాకుల గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. ఒకవైపు నాగచైతన్య "థాంక్యూ" సినిమాతో బిజీగా ఉండగా, సమంత కూడా విజయ్‌ దేవరకొండతో కలిసి "ఖుషీ" సినిమాతో బిజీ అయ్యింది.

తాజాగా నాగ చైతన్య వ్యక్తిగత జీవితం గురించి ఒక షాకింగ్ వార్త ఇండస్ట్రీ ని కుదిపేస్తోంది. చై "గూఢచారి" మరియు "మేజర్" లలో నటించిన శోభితా ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నాడని, గత కొంతకాలంగా వారు కలిసి తిరుగుతున్నారని వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే ఇద్దరు నటుల పీఆర్‌ టీమ్‌ లు ఈ డేటింగ్ వార్తలను ఖండించాయి. కొందరు కావాలనే నాగ చైతన్యను టార్గెట్‌ చేసి ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ చై పీఆర్‌ టీమ్‌ క్లారిటీ ఇచ్చింది.

ఇక నాగచైతన్య పీఆర్‌ టీమ్‌ చేసిన ఈ స్టేట్మెంట్ లపై సమంత తన ట్విట్టర్‌ ఖాతాలో ఘాటుగా స్పందించింది. "అమ్మాయిపై వచ్చే వార్తలన్నీ కచ్చితంగా నిజాలు కానీ అబ్బాయిపై వచ్చే పుకార్లు మాత్రం కాదా? అమ్మాయి పై వచ్చే పుకార్లు కావాలని చేయిస్తున్నట్లు కాదా? ఇప్పటికైనా ఎదగండి. ఇద్దరూ తమ జీవితాల్లో ముందుకెళ్లిపోయారు. మీరు కూడా మీమీ జీవితాల్లో ముందుకు వెళ్తే బావుంటుంది. మీ పని, మీ కుటుంబాలపై దృష్టి పెట్టండి" అంటూ సమంత తన ట్విట్టర్‌ ద్వారా ఫైర్ అయ్యింది. సమంత చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story