Shaakuntalam: సమంత 'శాకుంతలం' షురూ..

Shaakuntalam: ఎట్టకేలకు సమంత ప్రధాన పాత్రలో నటించనున్న అపురూప ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’సినిమా షూటింగ్ నేడు మొదలైంది.

Venkata Chari
Published on: 15 March 2021 5:41 PM IST
Samantha, Gunasekhar & Dil Raju Combo Movie Shakunthalam Shooting Started
X

శాకుంతలం మూవీ షూటింలో సమంత, దిల్ రాజు, గుణశేఖర్

Shaakuntalam: ఎట్టకేలకు సమంత ప్రధాన పాత్రలో నటించనున్న అపురూప ప్రేమకథా చిత్రం 'శాకుంతలం' సినిమా షూటింగ్ నేడు మొదలైంది. శాకుంతల-దుష్యంతుల ప్రేమకావ్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నటీనటులతోపాటు దర్శక-నిర్మాతలు పాల్గొన్నారు. అల్లు అరవింద్‌ ఛీప్ గెస్ట్ గా హాజరయ్యారు.

అనంతరం సమంత అక్కినేని మీడియాతో మాట్లాడారు. నటిగా నా కెరీర్‌ ప్రారంభించి దాదాపు 10 ఏళ్లు అవుతోందని, ఇప్పటి వరకూ 50 సినిమాల్లో నటించానని తెలిపారు. హీరోయిన్, విలన్‌.. ఇలా వైవిధ్యమైన పాత్రలు పోషించానని పేర్కొన్నారు. కానీ, చిన్నప్పటి నుంచి రాకుమార్తెగా కనిపించాలని అనుకునే దానిని, అదే నా డ్రీమ్‌ రోల్ అని వెల్లడించారు‌. ఇప్పుడు గుణశేఖర్‌ సర్‌ వల్ల 'శాకుంతలం'తో నా కల నిజమవబోతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ పదేళ్ల నా కెరీర్‌లో గుణశేఖర్‌, దిల్‌రాజు.. ఈసినిమా రూపంలో అతిపెద్ద గిఫ్ట్ అందించారని తెలిపారు. ఇలాంటి అద్భుతమైన సినిమాలో భాగమైనందుకు ఆనందిస్తున్నానని వెల్లడించారు. గుణశేఖర్‌ కుమార్తె నీలిమ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. అలాగే, ఇందులో సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌మోహన్‌ నటించనున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story