సోషల్‌ మీడియాలో సైలెంట్‌ అయిపోయిన సామ్‌.. ఆందోళనలో ఫ్యాన్స్..

Samantha Goes Missing on Social Media
x

సోషల్‌ మీడియాలో సైలెంట్‌ అయిపోయిన సామ్‌.. ఆందోళనలో ఫ్యాన్స్..

Highlights

Samantha: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో సమంత కూడా ఒకరు.

Samantha: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. సినిమా విశేషాలతో పాటు తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను అందులో షేర్‌ చేస్తుంటుంది. అదేవిధంగా తన వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. బ్రాండ్‌ ప్రమోషన్స్‌ను కూడా చేసుకునేది. ఇలా ఏదో ఒక రకంగా నెట్టింట్లో చురుకుగా ఉండే సామ్‌ సడెన్‌గా సైలెంట్‌ అయిపోయింది. సమంత చివరిగా జూన్‌ 30న ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది. ఆ తర్వాత ఆమె సోషల్‌ మీడియాకు దూరమై పోయింది. ట్విటర్‌లో కూడా ఎలాంటి పోస్ట్‌ పెట్టలేదు.

ఆ మధ్య సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాక్‌ అయిందని ఆమె టీమ్‌ పేర్కొంది. ఆ తర్వాత సమంత నుండి ఒక్క పోస్ట్ కానీ, స్టోరీ కానీ లేదు. తరచు తన ఫోటోలను అప్‌లోడ్‌ చేసే సామ్‌ 15 రోజులు గడిచిన ఎలాంటి అప్‌డేట్స్‌ ఇవ్వకపోవడంతో ఆమె ఫాలోవర్స్‌లో ఆందోళన మొదలైంది. సమంత సోషల్ మీడియా డిటాక్స్ లో ఉందని కొందరు అంటుంటే, ఆమె మానసిక స్థితి ఏమాత్రం బాగాలేదని మరికొందరు అంటున్నారు.

తను కావాలనే గ్యాప్ తీసుకుందని, కొంచెం గ్యాప్ ఇచ్చి సినిమా అప్ డేట్ తో వస్తే బాగుంటుందని ఆమె భావిస్తున్నట్టు మరికొందరు చెబుతున్నారు. ఇంకొందరు మాత్రం సమంత సోషల్ మీడియా టీమ్ సెలవు పెట్టిందంటూ జోకులు వేస్తున్నారు. కారణం ఏదైనా, సమంత సోషల్ మీడియాకు దూరమైందనేది మాత్రం వాస్తవం. మళ్లీ ఎప్పుడు ఇన్ స్టాగ్రామ్ వేదికగా యాక్టివ్ అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories