Samantha: ఇంకా ఎక్కువ స్టంట్లు చేస్తున్న సమంత

Samantha Doing More Stunts
x

Samantha: ఇంకా ఎక్కువ స్టంట్లు చేస్తున్న సమంత

Highlights

Samantha: "ది ఫ్యామిలీ మ్యాన్" కంటే ఈ వెబ్ సిరీస్ కోసం సమంత ఎక్కువ స్టంట్ లు చేసిందట

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఈ మధ్యనే "ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2" వెబ్ సిరీస్ తో హిందీ ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ఈ వెబ్ సిరీస్లో నెగిటివ్ పాత్రలో కనిపించిన సమంత తన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ మంచి విజయాన్ని సాధించింది.

తాజా గా ఇప్పుడు సమంత మళ్ళీ రాజ్ అండ్ డీకే దర్శకత్వం లో ఇంకొక వెబ్ సిరీస్ లో నటిస్తోంది అదే "సిటాడెల్". వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఒక ప్రముఖ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కి రీమేక్ గా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంగ్లీషులో ప్రియాంక చోప్రా ఈ వెబ్ సిరీస్ లో నటించగా హిందీలో సమంతా నటిస్తోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ లో తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ఈ వెబ్ సిరీస్ కోసం సమంత చాలా కష్టపడిందని కొన్ని చాలెంజింగ్ సన్నివేశాలు కూడా నటించిందని చెప్పిన రాజ్ అండ్ డీకే సమంత ఈ వెబ్ సిరీస్ కోసం కొన్ని ఇంటెన్స్ స్టంట్ సన్నివేశాల్లో కూడా నటించిందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా "ది ఫ్యామిలీ మ్యాన్" సిరీస్లో కంటే ఈ వెబ్ సిరీస్ కోసం సమంత ఎక్కువ స్టంట్ సన్నివేశాలు చేసిందని తెలుస్తోంది. ఇక సమంతా ని మరొకసారి యాక్షన్ ఓరియంటెడ్ అవతార్లో చూడడానికి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories